Rahul Gandhi : విద్వేష రాజకీయాలు రక్షించవు – రాహుల్
మధ్యప్రదేశ్ లో ముగిసిన యాత్ర
Rahul Gandhi : తన సోదరుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో ముగిసింది. ఆదివారం రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని, కులం, మతం, ప్రాంతం పేరుతో మనుషులను విడదీసేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ.
ఇదే సమయంలో దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ కావాలనే నినాదంతో భారత్ జోడో యాత్రను చేపట్టారు రాహుల్ గాంధీ. ఈ యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. అక్కడి నుంచి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పూర్తయింది.
ఈ సందర్భంగా చిన్నారుల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన యాత్రకు సపోర్ట్ గా నిలిచారు. ప్రధానంగా సినీ రంగానికి చెందిన వారితో పాటు క్రీడా రంగానికి చెందిన వారు కూడా రాహుల్ తో కలిసి అడుగులో అడుగు వేశారు. ఇదిలా ఉండగా తన సోదరుడు చేపట్టిన యాత్ర సక్సెస్ కావడంతో ప్రియాంక గాంధీ కూడా మహిళా యాత్ర చేపట్టనున్నట్లు టాక్.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ పై , దాని అనుబంధ సంస్థలపై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ కావాలని విద్వేషాలు రెచ్చ గొడుతున్నారంటూ ఆరోపించింది బీజేపీ. ఇదిలా ఉండగా సచిన్ పైలట్ కూడా పరుగులు తీయడం ఆసక్తిని రేకెత్తించేలా చేసింది.
Also Read : ఓట్ల తొలగింపులో ఆప్ సర్కార్ కుట్ర