CM KCR : కేంద్రం నిర్వాకం తెలంగాణ‌కు తీర‌ని న‌ష్టం

మోదీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

CM KCR : సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. మ‌రోసారి కేంద్ర స‌ర్కార్ పై, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఆదివారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో కొత్త‌గా నిర్మించిన జిల్లా క‌లెక్ట‌రేట్ ను, టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాల‌ను సీఎం కేసీఆర్(CM KCR) ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కేంద్ర ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ విధానాల వ‌ల్లనే తెలంగాణ ప్రాంతానికి తీర‌ని న‌ష్టం జ‌రిగింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. దీని వ‌ల్ల తాను ఎంతో ఇబ్బంది ప‌డ్డాన‌ని అన్నారు. ఒక‌టి కాదు వంద‌లు కాదు కేవ‌లం 3 ల‌క్ష‌ల కోట్లు తెలంగాణ న‌ష్ట పోయింద‌ని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ‌కు రావాల్సిన వాటాను తేల్చాల‌ని ప‌లుమార్లు డిమాండ్ చేసినా కేంద్రం స్పందించిన పాపాన పోలేద‌న్నారు.

కేంద్రంలో కొలువు తీరి ఎనిమిది సంవ‌త్స‌రాలు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు నోరు మెద‌ప‌డం లేద‌న్నారంటూ మండిప‌డ్డారు కేసీఆర్. తాను ప‌లుమార్లు విన‌తిప‌త్రాలు ఇచ్చినా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌న్నారు. గ‌తంలో ఎన్నిక‌లు జ‌రిగిన సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు ఎన్నో హామీలు గుప్పించార‌ని కానీ ఒక్క‌టి కూడా తీర్చ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు కేసీఆర్(CM KCR).

ఇప్ప‌టి వ‌ర‌కు కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటా ఏమిటో తేల్చేంత వ‌ర‌కు తాను ఊరుకోనంటూ హెచ్చ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను ఇవ్వ‌డంలో కావాల‌ని తొక్కి పెట్టింద‌న్నారు సీఎం. ఏదో ఒక రోజు బొంద పెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. తాను మీ అంద‌రి కోసం బీఆర్ఎస్ పార్టీని స్థాపించాన‌ని అన్నారు.

Also Read : కేసీఆర్ కు నేనే ప్ర‌త్యామ్నాయం – ష‌ర్మిల‌

Leave A Reply

Your Email Id will not be published!