CJI Chandrachud : న్యాయ విద్య‌లో వైవిధ్యం అవ‌స‌రం – సీజేఐ

నైతిక‌త‌తో కూడిన వ్య‌క్తులు త‌యారు కావాలి

CJI Chandrachud : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్(CJI Chandrachud) షాకింగ్ కామెంట్స్ చేశారు. కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్ ) ద్వారా జాతీయ న్యాయ పాఠ‌శాల‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ప్ర‌స్తుత విధానం స‌రిగా లేద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇది ఎల్ల‌ప్పుడూ విలువల‌తో కూడిన ఆధారిత న్యాయ విద్య‌ను ప్రోత్స‌హించ‌డం లేద‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

స‌రైన నైతిక‌త‌తో కూడిన వ్య‌క్తులు త‌యారు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. క్లాట్ కు సంబంధించి ఎక్స్ అఫీషియో విజిట‌ర్ అయిన సీజీఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి, విశ్వ విద్యాల‌య ఛాన్సల‌ర్ పీఎస్ న‌ర‌సింహ‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ ట్ర‌స్ట్ స‌భ్యుడిగా ఉన్నారు.

న్యాయ విద్య‌లో స‌మూల మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అంతే కాకుండా విద్యలో వైవిధ్యం ఉండాల‌ని పిలుపునిచ్చారు జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్(CJI Chandrachud). గోవా లోని ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ ఆఫ్ లీగ‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ ప్రారంభ సెష‌న్ లో ప్ర‌సంగించారు.

న్యాయ శాస్త్రంను అభ్యసిస్తున్న వారు ప్ర‌త్యేకించి నైతిక‌త ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు సీజేఐ. జాతీయ న్యాయ విశ్వ విద్యాల‌యాలు ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయి.

విద్యార్థుల‌ను ఎంపిక చేసేందుకు ఉప‌యోగించే మోడ‌ల్ ఎల్ల‌ప్పుడూ విలువ ఆధారిత న్యాయ విద్య‌ను ప్రోత్స‌హించద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు సీజేఐ చంద్ర‌చూడ్. దేశం మూలాల గురించి కూడా ప్ర‌తి ఒక్క‌రు తెలుసు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీజేఐ.

Also Read : సంస్థాగ‌త జ‌వాబుదారీత‌నం అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!