Gujarat Election 2022 : గుజ‌రాత్ లో రెండో విడ‌త పోలింగ్

అహ్మ‌దాబాద్ లో ఓటు వేయ‌నున్న పీఎం

Gujarat Election 2022 : గుజ‌రాత్ లో ఎన్నిక‌ల సంగ్రామం ముగిసింది. సోమ‌వారం నాటితో మొత్తం 182 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి పొలింగ్ పూర్త‌వుతుంది. అధికారంలో గ‌త 27 సంవ‌త్స‌రాలుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలో కొన‌సాగుతూ వ‌స్తోంది. గ‌తంలో ఇక్క‌డ న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ సీఎంగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం భూపేంద్ర ప‌టేల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నిక‌లు ప్ర‌ధానంగా మోదీ పాల‌న‌కు, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షా వ్యూహాల‌కు ప‌రీక్ష‌లు కానున్నాయి.

ఇక గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేవ‌లం భార‌తీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే పోరు ఉండేది. కానీ ఈసారి మ‌రో రెండు కొత్త పార్టీలు చేరాయి. బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం బ‌రిలో ఉన్నాయి. మొద‌టి విడ‌త పోలింగ్ డిసెంబ‌ర్ 1న ముగిసింది. మొత్తం 89 నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ జ‌రిగింది. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేదు.

డిసెంబ‌ర్ 5న రెండో విడ‌త పోలింగ్(Gujarat Election 2022) కొద్ది సేప‌టి కింద‌ట ప్రారంభ‌మైంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని 93 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేసింది. మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని బీజేపీ ధీమా వ్య‌క్తం చేస్తోంది.

ఇదిలా ఉండ‌గా ఇవాళ దేశ ప్ర‌ధాన‌మంత్రి మోదీ అహ్మ‌దాబాద్ లో త‌న ఓటు హ‌క్కు వినియోగించు కోనున్నారు. ఇప్ప‌టికే భారీగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఆయ‌న‌తో పాటు అమిత్ షా కూడా ఓటు వేస్తారు. మ‌రోసారి విజ‌యం సాధించి చ‌రిత్ర సృష్టించాల‌ని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

Also Read : ఓట‌ర్ల‌కు బీజేపీ డ‌బ్బుల‌తో ఎర – డింపుల్

Leave A Reply

Your Email Id will not be published!