PM Modi Vote : అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని
తమ ఓటు హక్కు వినియోగించాలి
PM Modi Vote : గుజరాత్ ఎన్నికల్లో భాగంగా రెండవ విడత పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో సోమవారం ఉదయం దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ తన ఓటు హక్కు(PM Modi Vote)ను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లకు ప్రధానమంత్రి అభివాదం చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమన్నారు. ఒక్క ఓటు ఎంతో విలువైనదని ఆ ఒక్క ఓటుతోనే ప్రభుత్వాలు పడిపోయిన దాఖలాలు ఉన్నాయని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతకు ముందు నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో ఉన్న తన తల్లి హీరాబెన్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె పాదాలను తాకారు. ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రం సమీపంలో ఉన్న తన సోదరుడు సోమ మోదీ ఇంటికి నడిచి వెళ్లారు.
ఇదిలా ఉండగా నిషాన్ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన తన ఓటు వేశారు. అంతే కాకుండా పోలింగ్ బూత్ కు పీఎం నడుచుకుంటూ వస్తున్న వారిని మరింత ఉత్సాహ పరిచారు. దారిలో ఉన్న ఓటర్లకు తల వంచి నమస్కారం చేశారు. క్యూలో నిలబడి సాధారణ పౌరుడిగా తన వంతు వచ్చే వరకు వేచి ఉన్నారు ప్రధానమంత్రి.
ప్రజాస్వామ్య పండుగ జరుపుకుంటున్నారని ఈ సందర్భంగా ఓటు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు. తనకు ఎంతో సంతోషం కలుగుతోందన్నారు మోదీ.
Also Read : మద్ధతు ఇచ్చినందుకు థ్యాంక్స్ – మోదీ