Draupadi Murmu Tirumala : శ్రీవారి సేవలో ద్రౌపది ముర్ము
వేదపండితుల ఆశీర్వచనం
Draupadi Murmu Tirumala : భారత దేశ రాష్ట్రపతిగా కొలువు తీరిన తర్వాత మొట్ట మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా పౌర సన్మానం చేపట్టారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.
విశాఖపట్నంలో నేవీడేలో పాల్గొంటారు. సోమవారం తిరుమలను సందర్శించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మల ఆశీర్వాదం తీసుకున్నారు(Draupadi Murmu Tirumala). అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి వారికి సంబంధించిన తీర్థ ప్రసాదాలను అందజేశారు.
దీంతో పాటు స్వామి వారి చిత్ర పటాన్ని ఇచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. సాదర స్వాగతం పలికారు ఈవో ధర్మారెడ్డి. వీరితో పాటు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కూడా ఉన్నారు.
అక్కడి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలోని విద్యార్థులతో భేటీ అయ్యారు. ఇక్కడ కార్యక్రమాలు పూర్తి అయ్యాక ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలు దేరుతారు. ఇంకో వైపు తిరుమలకు భక్తులు పోటెత్తారు.
14 కంపార్ట్ మెంట్లలో భక్లులు స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం వేచి ఉన్నారు. 20 గంటలకు పైగా దర్శనం కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తోంది.
Also Read : న్యాయ విద్యలో వైవిధ్యం అవసరం – సీజేఐ