Revanth Reddy : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఎప్పుడు – రేవంత్
టీఆర్ఎస్..బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే
Revanth Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయకుండా ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే నోటీసులు జారీ చేసిందని కానీ తాత్సారం ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు.
ఫోన్లు ధ్వంసం చేసింది..రూ. 100 కోట్లు మార్చిందని ఇప్పటికే ప్రకటించారని మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. నువ్వు కొట్టినట్టు చేయి నేను తిట్టినట్టు చేస్త అని కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయంటూ ఆరోపించారు.
ఇద్దరూ తోడు దొంగలేనని పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్(Revanth Reddy). ఇదిలా ఉండగా టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రధానంగా కోడంగల్ లో అభివృద్ది అన్నది కనిపించడం లేదన్నారు. దత్తత తీసుకున్నానని ప్రకటించిన మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారని , ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గత నాలుగు సంవత్సరాలలో కోడంగల్ నియోజకవర్గం కోసం ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసం నిరాహారదీక్ష చేపట్టాలని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి, పాలమూరు జిల్లాలకు ఉపయోగపడే పాలమూరు , రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు టీపీసీసీ చీఫ్.
కాంగ్రెస్ పార్టీని కావాలని దెబ్బ తీసేందుకు గులాబీ, కాషాయం కలిసి కట్టుగా యత్నిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ సర్కార్ కవితను, టీఆర్ఎస్ సర్కార్ బీఎల్ సంతోష్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలని అన్నారు.
Also Read : రూటు మార్చిన కవిత నేను ఫుల్ బిజీ