Ashok Gehlot : రాహుల్ యాత్రపై క‌క్ష క‌ట్టిన మీడియా – గెహ్లాట్

యాత్ర‌లో ల‌క్ష మంది పాల్గొన్నా ప్ర‌చారం సున్నా

Ashok Gehlot : రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న జాతీయ మీడియాపై నిప్పులు చెరిగారు. గోదీ మీడియా కావాల‌ని రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్రను కావాల‌ని ప‌క్క‌న పెట్టింద‌ని పేర్కొన్నారు. వేలాది జ‌నం స్వ‌చ్చంధంగా త‌ర‌లి వ‌స్తున్నార‌ని కానీ ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాలు ప‌ట్టించు కోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

సోమ‌వారం అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ఏం చేయ‌క పోయినా ప్ర‌ధాన‌మంత్రి మోదీకి పెద్ద ఎత్తున ప్ర‌యారిటీ ఇస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇదిలా ఉండ‌గా సెప్టెంబ‌ర్ 7న త‌మిళ‌నాడు లోని క‌న్యాకుమారి లో రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌ను ప్రారంభించారు. 3,500 కిలోమీట‌ర్ల మేర‌కు పైగా యాత్ర చేప‌ట్ట‌నున్నారు. 150 రోజుల‌కు పైగా పాద‌యాత్ర జ‌ర‌గ‌నుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ , తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో భార‌త్ జోడో యాత్ర ముగిసింది. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ లో కొన‌సాగుతోంది. ఈ యాత్రలో సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) తో పాటు యువ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్ పాల్గొన్నారు.

కావాల‌ని భారత్ జోడో యాత్ర‌ను మీడియా బ‌హిష్క‌రించింద‌ని సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్య‌క్తం చేశారు. యాత్ర‌ను ఎడిట‌ర్లు బ్యాన్ పెట్టార‌నేది నా ఆరోప‌ణ‌. లక్ష‌ల మంది పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నార‌ని కానీ ఎక్క‌డా ప్ర‌చారం క‌ల్పించక పోవ‌డం దారుణ‌మ‌న్నారు సీఎం. దేశ మీడియాను చ‌రిత్ర క్ష‌మించ‌ద‌న్నారు అశోక్ గెహ్లాట్.

ఎలాంటి అభివృద్ది లేక పోయినా బీజేపీకి , పీఎంకు , నాయ‌కుల‌కు ఎక్కువ ప్రచారం క‌ల్పిస్తున్నార‌ని ఆరోపించారు.

Also Read : ద్వేషంతో దేశాన్ని జ‌యించలేం – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!