Jairam Ramesh : రాజకీయ నియంతృత్వం ప్రమాదం
ప్రధాని మోదీ తీరుపై జైరాం రమేష్
Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధాన కార్యదర్శి, మీడియా ఇంఛార్జి జైరాం రమేష్(Jairam Ramesh) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దృష్టిలో పెట్టుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నియంతృత్వం వాస్తవ రూపం దాల్చుతోందని అన్నారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాల వల్ల భారతదేశ విభజన జరిగే అవకాశం పెరిగిందని ఆరోపించారు.
ఇందులో భాగంగానే పొలిటికల్ డిక్టేటర్షిప్ వాస్తవంగా కళ్లకు కనిపిస్తోందన్నారు. దేశం ముందు మూడు సవాళ్లు ఉన్నాయన్నారు. వాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు జైరాం రమేష్(Jairam Ramesh). ప్రధానమంత్రి ముందు చూపు లేకుండా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశం మరో వందేళ్లు వెనక్కి వెళుతోందని ఆరోపించారు.
రోజు రోజుకు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీతో పాటు ఆయనకు చెందిన పార్టీ, అనుబంధ సంస్థలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు జైరాం రమేష్. విభజన భావజాలం మరింత పెరగడం వల్ల ప్రజల మధ్య విభేదాలు నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఝలావర్ జిల్లా బాలి బోర్డా గ్రామంలో మాట్లాడారు.
రాజకీయ నియంతృత్వం మరింత పెరిగిందన్నారు. ఇది వ్యక్తులను, వ్యవస్థను, సమాజాన్ని నిర్వీర్యం చేసేలా మారుతోందన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాంగ సంస్థలను పూర్తిగా పక్కన పెట్టారంటూ మండిపడ్డారు జైరాం రమేష్.
Also Read : లవ్ జిహాద్ పై చట్టం తీసుకు వస్తాం