Sajjala Ramakrishna Reddy : నియమిస్తాం కానీ తొలగించం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా
Sajjala Ramakrishna Reddy : కడుపు నింపడం మాత్రమే సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించిన చరిత్ర మా ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. తాజాగా రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీనిపై సోమవారం క్లారిటీ ఇచ్చారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). సమాచార లోపం వల్లనే ఇలా జరిగిందన్నారు. తాము నియమించడమే తప్ప తీసి వేయడం ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ ఒక్కరినీ ఇప్పటి వరకు తొలగించ లేదని పేర్కొన్నారు. కొందరు కావాలని దుష్ఫ్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దంటూ కోరారు.
ఇదిలా ఉండగా పంచాయతీరాజ్ విభాగంలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో కలకలం రేపేలా చేశాయి. దీనిపై సీరియస్ గా స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఇవన్నీ వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. కొలువులు ఇవ్వడం, భర్తీ చేయడం తప్ప తొలగించడం అంటూ ఉండదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి సీఎం సీరియస్ అయ్యారని , ఔట్ సోర్సింగ్ లో కానీ లేదా కాంట్రాక్టు కింద కానీ పని చేస్తున్న వారిలో ఏ ఒక్కరిని తీసి వేయడం అంటూ ఉండదన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చింది మాత్రమేనని పేర్కొన్నారు. ఈ మొత్తం తతంగంపై విచారణకు ఆదేశించామన్నారు.
Also Read : అరెస్ట్ భయం కవిత నాటకం – బండి సంజయ్