Exit Polls 2022 : ఎగ్జిట్ పోల్స్ లో కమల వికాసం
హిమాచల్ ప్రదేశ్ లో నువ్వా నేనా
Exit Polls 2022 : గుజరాత్ లో ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో పూర్తయ్యాయి. ఆ రెండు రాష్ట్రాలతో పాటు దేవ రాజధానిలో ఢిల్లీ బల్దియా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటనుంది. రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరింత బలం చేకూరనుంది బీజేపీకి.
ఇక గత 27 ఏళ్లుగా గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ పవర్ లో ఉంది. మరోసారి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్(Exit Polls 2022) వెల్లడించాయి. వరుసగా ఏడోసారి విజయం సాధించే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. గుజరాత్ లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీకి 132 సీట్లు వస్తాయని వెల్లడించాయి.
ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కాగా గుజరాత్ లో హోరా హోరీగా ప్రచారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆశించినంత మేర సీట్లను సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని వెల్లడించాయి.
2002 ఎన్నికల తర్వాత 1, 000 మంది ముస్లింలు ఎక్కువగా మరణించిన అల్లర్ల తర్వాత ఈ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 2017లో బీజేపీలో రెండెంకల స్కోర్ 99కు పరిమితం అయ్యింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో ఆపార్టీ మరికొన్ని సీట్లు అదనంగా గెలుచుకునే అవకాశం ఉంది.
ఇక హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి హిల్ స్టేట్ లో వరుసగా రెండోసారి రికార్డు స్థాయిలో విజయం సాధించవచ్చని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి 68 సీట్లలో 35 వస్తాయని కాంగ్రెస్ 29 సీట్లతో వెనుకబడి ఉంది. ఇదిలా ఉండగా గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ లకు సంబంధించి డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read : ఢిల్లీ బల్దియాపై ఆప్ దే జెండా