Ruchira Kamboj : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం అవసరం
యుఎన్ శాశ్వత ప్రధినిధి రుచిరా కాంబ్జ్
Ruchira Kamboj : యావత్ ప్రపంచాన్ని ఉగ్రవాదం ఇబ్బందులకు గురి చేస్తోందని దీనిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అమెరికాలో భారత దేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్(Ruchira Kamboj). 26/11 దాడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భయంకరమైన, అమానవీయ ఉగ్రవాద చర్యలకు మనం జవాబుదారీగా ఉండగలిగినప్పుడే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాట బలోపేతం అవుతుందన్నారు.
ప్రపంచానికి ప్రస్తుతం టెర్రరిజం పెను సవాల్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం దాని అన్ని రూపాలు , వ్యక్తీకరణలలో ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు రుచిరా కాంబోజ్. ఉగ్రవాదానికి ఏకీకృత, శూన్య సహన విధానం మాత్రమే చివరికి దానిని ఓడించగలం, నిర్మూలించ గలమని స్పష్టం చేశారు.
ఇరాక్ ప్రజల ప్రభుత్వం ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ కి వ్యతిరేకంగా వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నందున , ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదానికి సంబంధించి శిక్షార్హతపై పోరాడటం కూడా చాలా కీలకమన్నారు రుచిరా కాంబోజ్(Ruchira Kamboj). ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ముఖ్యమన్నారు.
ఇందుకు సంబంధించి ఆర్థిక సాయం చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు భారత శాశ్వత ప్రతినిధి. వరల్డ్ వైడ్ గా వివిధ రూపాలలో ఉగ్రవాద సంస్థలు కుప్పలు తెప్పలుగా పుట్టుకు వస్తున్నాయని తెలిపారు. వేర్వేరు రూపాలలో ఉన్నప్పటికీ అవి మానమ సమూహాన్ని టార్గెట్ గా చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రుచిరా కాంబోజ్.
ప్రపంచాన్ని ఎక్కువగా భయపెట్టేలా చేస్తోంది ఉగ్రవాదులు ఆధునిక టెక్నాలజీని వాడుకోవడమేనని పేర్కొన్నారు. దీనిని నిర్మూలించేందుకు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Also Read : కేంద్ర పాలిత ప్రాంతాలకు పవర్స్ ఉండవు