Srilankan President : ఆర్థిక సంస్కరణలు గట్టెక్కించ లేవు
శ్రీలంక ప్రెసిడెంట్ రణిలె విక్రమసింఘె
Srilankan President : శ్రీలంక దేశ అధ్యక్షుడు రణిలె విక్రమసింఘె షాకింగ్ కామెంట్స్ చేశారు. మనకు ఆర్థిక వ్యవస్థే సరిగా లేనప్పుడు ఇక సంస్కరణలు తీసుకు వస్తే ఎలాంటి ప్రయోజనం లేదని కుండ బద్దలు కొట్టారు. ఇటీవలి కాలంలో దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటు పడి పోయిందన్నారు.
దీనిని గట్టెక్కించాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. తన అనుభవంలో తెలుసుకున్నది ఏమిటంటే ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు విరుగుడు కాదని అంగీకరించారు రణిలే విక్రమసింఘే. పాత ఆర్థిక వ్యవస్థ వల్ల శ్రీలంకకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
ప్రస్తుతం తమ ముందున్న ప్రధానమైన అవసరం ఏమిటంటే కొత్తగా ఆర్థిక వ్యవస్థను నిర్మించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు రణిలె విక్రమసింఘె(Srilankan President) . నగదు కొరత ఉన్న ద్వీప దేశం ఆర్థిక వ్యవస్థను కలిగి లేనందున కొత్త ఆర్థిక నమూనా కోసం బలమైన వ్యవస్థను రూపొందించాలన్నారు.
శ్రీలంకలో ఆర్థిక సంస్కరణల వల్ల ప్రయోజనం లేదని మరోసారి కుండబద్దలు కొట్టారు దేశ అధ్యక్షుడు. ఇదిలా ఉండగా 1948లో స్వాతంత్రం పొందినప్పటి నుండి అత్యంత ఘోరమైనన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు.
విదేశీ మారక నిల్వల తీవ్ర కారణంగా ఈ దుస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు రణిలె విక్రమసింఘె. శ్రీలంక ఎకనామిక్ సమ్మిట్ ప్రారంభ సెషన్ లో ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాలం చెల్లిన ఆర్థిక వ్యవస్థల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్ద లేమని అన్నారు శ్రీలంక దేశ అధ్యక్షుడు.
Also Read : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం అవసరం