Priyanka Chaturvedi Shinde : షిండే మౌనం ప్రియాంక ఆగ్రహం
కర్ణాటక..మహారాష్ట్ర సరిహద్దు వివాదం ఉద్రిక్తం
Priyanka Chaturvedi Shinde : రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. మంగళవారం బెలగావిలో మరాఠాకు చెందిన ట్రక్కులపై కొందరు కర్ణాటక పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారు.
దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత తగ్గించేందుకు ప్రయత్నాలు చేశామని ఇప్పటికే ప్రకటించారు సీఎం బొమ్మై. అయితే ఏకపక్షంగా దాడులు చేస్తే ఎలా అని నిప్పులు చెరిగారు శివసేన బాల్ ఠాక్రే పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. ఆమె తీవ్రంగా స్పందించారు.
ఓ వైపు దాడులు చేస్తుంటే సీఎం ఏక్ నాథ్ షిండే(Shinde) ఏం చేస్తున్నారని , నిద్ర పోతున్నారా అంటూ నిలదీశారు. బెలగావి సమీపంలోని జాతీయ రహదారి 48 వద్ద వివిధ కన్నడ అనుకూల సంస్థల సభ్యులు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్లు కలిగిన వాహనాలను అడ్డుకున్నారని, పలువురు తీవ్ర భయాందోళనకు గురయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ.
ఈ విపత్కర, ఉద్రిక్తత సమయంలో శివసేన, బీజేపీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని మండిపడ్డారు ప్రియాంక చతుర్వేది. దీంతో భయంతో వణికి పోయారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించక పోవడంపై నిప్పులు చెరిగారు ఎంపీ.
ఇది సిగ్గు చేటు.. మహారాష్ట్ర సీఎం కర్ణాటక సీఎంతో ఎందుకు కఠినంగా మాట్లాడలేక పోతున్నారంటూ ప్రశ్నించారు ప్రియాంక చతుర్వేది. ఎవరైనా దాడులకు పాల్పడుతుంటే కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తందంటూ ప్రశ్నించారు ప్రియాంక(Priyanka Chaturvedi).
Also Read : సాకేత్ గోఖలే అరెస్ట్ అక్రమం – సీఎం