Winter Session : 16 కొత్త బిల్లులు ప్ర‌వేశ పెట్ట‌నున్న కేంద్రం

శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం

Winter Session : పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. మొట్ట మొద‌టిసారిగా ఉప రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ సార‌థ్యంలో ఎగువ స‌భ‌కు ఎక్స్ అఫీషియో చైర్మ‌న్ గా రాజ్య‌స‌భ‌లో కార్య‌క‌లాపాలు నిర్వ‌హించనున్నారు. ఆయ‌న గ‌తంలో ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌నకు కొత్త అనుభ‌వం రానున్న‌ది.

స‌మావేశంలో తొలి రోజు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మీడియాతో మాట్లాడ‌నున్నారు. ఈ సెష‌న్ లో 16 కొత్త బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్ట‌నుంది మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే అటు లోక్ స‌భ‌లో ఇటు రాజ్య‌స‌భ‌లో కావాల్సినంత మెజారిటీ బీజేపీకి ఉంది.

బిల్లులకు సంబంధించి ప్ర‌తిప‌క్షాలు అభ్యంత‌రాలు లేవ‌దీసినా పాస్ కావ‌డం ఖాయం. ఇందులో భాగంగా పార్ల‌మెంట్ శీతాకాల(Winter Session)  స‌మావేశాలు ప్రారంభం కానున్న వెంట‌నే ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయిన నేత‌ల‌కు పార్ల‌మెంట్ స‌భ్యులు నివాళులు అర్పిస్తారు. అనంత‌రం స‌భ ప్రారంభ‌మ‌వుతుంది.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బ‌హుళ – రాష్ట్ర స‌హ‌కార సంఘాల చ‌ట్టం 2022 బిల్లును ప్ర‌వేశ పెడ‌తారు. దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాల‌జీ , ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వులు – వాతావ‌ర‌ణం పై బిల్లులు ప్ర‌వేశ పెడ‌తారు. ప్ర‌జా ఫిర్యాదులు, పెన్ష‌న్ల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 29 వ‌ర‌కు కొన‌సాగనున్నాయి.

గ‌నుల శాఖ మంత్రి రావు సాహెబ్ దాదా రావు, వాణిజ్యం, ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి అనుప్రియా సింగ్ ప‌టేల్ , ఐటీ మినిస్ట‌ర్ రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ , జౌళి శాఖ నుండి ద‌ర్శ‌న విక్ర‌మ్ జ‌ర్దోష్ , వాణిజ్య శాఖ నుండి సోమ్ ప్ర‌కాష్ బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంది. అంతే కాకుండా భార‌త విదేశాంగ విధానంలో తాజా ప‌రిణామాల‌పై ప్ర‌క‌ట‌న చేయనున్నారు.

Also Read : రాజ్యాంగం లేకపోతే రాచ‌రిక‌మే

Leave A Reply

Your Email Id will not be published!