Maharashtra Buses : సరిహద్దు వివాదం బస్సులకు మంగళం
నిర్ణయించిన మహారాష్ట్ర రోడ్ రవాణా సంస్థ
Maharashtra Buses : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఇరు రాష్ట్రాలలో పాలన సాగిస్తున్నది భారతీయ జనతా పార్టీ. కానీ ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేయలేదు. ఇప్పటికే కన్నడ భాష మాట్లాడే గ్రామాలను తాము విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించారు కర్ణాటక సీఎం బొమ్మై. ఈ మేరకు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు.
దీంతో అగ్గి రాజేసేందుకు మళ్లీ ఆయన చేసిన కామెంట్స్ తోడయ్యాయి. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది ఇరు రాష్ట్రాలకు సంబంధించి. గత కొంత కాలంగా ఈ కేసు నాన్చుతూ వస్తోంది. మరో వైపు త్వరలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుతం బొమ్మై సర్కార్ తీవ్ర అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకు రావడం దానిని హైలెట్ చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్రకు భారీ స్పందన వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ కు మైలేజ్ పెరిగింది.
దీంతో గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న ఈ సమస్యను తిరిగి తెరపైకి తీసుకు వచ్చింది కర్ణాటక. దీంతో గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కర్ణాటక రక్షణ సంస్థ పేరుతో పెద్ద ఎత్తున దాడులకు దిగారు కొందరు. ట్రక్కులను అడ్డుకున్నారు. మహారాష్ట్ర బస్సులపై దాడులకు దిగారు(Maharashtra Buses).
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము కర్ణాటకకు బస్సులను నడపడం లేదని మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. దీంతో వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read : షిండే మౌనం ప్రియాంక ఆగ్రహం