Elon Musk James Baker : టాప్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ బేకర్ పై వేటు
వెల్లడించిన ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్
Elon Musk James Baker : టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలిగించే కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే సిఇఓ పరాగ్ అగర్వాల్ , సీఎఫ్ఓ , లీగల్ హెడ్ లను తొలగించాడు.
ఆపై టాప్ ఎగ్జిక్యూటివ్ లు తమంతకు తామే వైదొలగారు. మరో వైపు ట్విట్టర్ లో కాస్ట్ కటింగ్ లో భాగంగా పర్మినెంట్, కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను 10 వేల మందికి పైగా తొలగించాడు ఎలాన్ మస్క్.
తాజాగా మరో కీలకమైన ఎగ్జిక్యూటివ్ ను తప్పించాడు. ట్విట్టర్ లో పని చేస్తున్న ఉద్యోగులకు కోలుకోలేని షాక్ తగిలింది. తమ ఉద్యోగాలు ఉంటాయో ఉండవోనన్న ఆందోళన నెలకొంది. సమాచార అణచివేతలో సాధ్యమైన పాత్రపై టాప్ ఎగ్జిక్యూటివ్ పాత్ర పోషిస్తున్న జేమ్స్ బేకర్ ను తొలగించారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్(Elon Musk James Baker) స్వతహాగా ప్రకటించాడు. 2020 యుఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు బైడెన్ ల్యాప్ టాప్ కు సంబంధించిన రిపోర్టింగ్ ను అణిచి వేసేందుకు మునుపటి ట్విట్టర్ మేనేజ్ మెంట్ చర్యలు తీసుకుందని ప్రచురించిన ఫైల్స్ లో పేర్కొన్నారు.
దీనిపై వివరణ ఇవ్వలేక పోవడంతో బేకర్ పై వేటు వేసినట్లు పేర్కొన్నారు మస్క్. ప్రస్తుతం తొలగించబడిన జేమ్స్ బేకర్ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ లో డిప్యూటీ జనరల్ గా పని చేస్తున్నారు. గత మేనేజ్ మెంట్ హయాంలో సమాచారాన్ని తొక్కి పెట్టి ఉంచడంలో తన పాత్రపై ఆందోళన చెందుతుండడం వల్లనే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు ఎలాన్ మస్క్.
Also Read : హైదరాబాద్ లో కాపిటలాండ్ డేటా సెంటర్