Punjab CM : ఢిల్లీ ఫలితాలు గుజరాత్ లో రిపీట్ – మాన్
విద్వేష రాజకీయాలు ఇక చెల్లుబాటుకావు
Punjab CM : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో 15 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న భారతీయ జనతా పార్టీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. మేయర్ పదవిని కైవసం చేసుకుంది. ఇప్పటికే ప్రభుత్వం నడుతున్న ఆప్ గత కొంత కాలంగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఇదే సమయంలో అన్ని కార్పొరేషన్లను కలిపి బీజేపీ ఒకటే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకు వచ్చింది. దీంతో మొత్తం 250 సీట్లకు గాను 135 సీట్లతో ఆప్ హవా కొనసాగించింది. భారతీయ జనతా పార్టీ 104 సీట్లకు పరిమితమైంది. దీంతో నగర పాలక సంస్థ ఇక ఆమ్ ఆద్మీ పార్టీ పరం కానుంది.
ఫలితాలు వెలువడిన అనంతరం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Punjab CM) , ఎంపీ రాఘవ్ చద్దా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అనంతరం పంజాబ్ సీఎం మీడియాతో మాట్లాడారు. విద్వేష రాజకీయాలు ఇక చెల్లుబాటు కావని ఢిల్లీ ప్రజలు నిరూపించారని స్పష్టం చేశారు.
ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, న్యాయం, ఉపాధి అని కులం, మతం పేరుతో విద్వేషాలు కాదని ఎద్దేవా చేశారు. ఆయన కేంద్ర సర్కార్ ను, బీజేపీ శ్రేణులను ఏకి పారేశారు. మోదీ మీడియా ఎంతగా దుష్ప్రచారం చేసినా ప్రజలు ఆప్ వైపు నిలబడ్డారని అన్నారు. ఇవే ఫలితాలు గుజరాత్ లో రిపీట్ అవుతాయని జోష్యం చెప్పారు భగవంత్ మాన్.
Also Read : ఆప్ విజయం అంతటా సంబురం