Raghav Chadha : అతి పెద్ద పార్టీపై చిన్నపాటి విజ‌యం

పంజాబ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు రాఘ‌వ్ చ‌ద్దా

Raghav Chadha : పంజాబ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నికల్లో 15 ఏళ్ల పాటు కొన‌సాగుతూ వ‌స్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధిప‌త్యానికి చెక్ పెట్టింది ఆప్. 250 స్థానాల‌కు గాను బుధ‌వారం ప్ర‌క‌టించిన ఫ‌లితాల్లో ఏకంగా ఆప్ 134 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది.

ఇక బీజేపీ కేవ‌లం 104 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. దీంతో ఈసారి దేశ రాజ‌ధాని మేయ‌ర్ పీఠం ఆప్ వశం కానుంది. చారిత్రాత్మ‌క విజ‌యాన్ని సాధించింది ఆప్ . ఒక ర‌కంగా బీజేపీ చేసిన ప్ర‌య‌త్నాల‌కు చెక్ పెట్టింది. ఊహించ‌ని రీతిలో షాక్ ఇచ్చింది ఆప్. బీజేపీ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసింది.

అంతే కాదు ఆప్ ను ముప్పు తిప్ప‌లు పెట్టింది. అవినీతి, ఆరోప‌ణ‌లు గుప్పించింది. కానీ ఎక్క‌డా వ‌ర్క‌వుట్ కాలేదు. ప్ర‌జ‌లు పూర్తిగా ఆప్ పై న‌మ్మ‌కం ఉంచారు. ఇది ఒక ర‌కంగా బీజేపీ శ్రేణుల‌ను విస్తు పోయేలా చేసింది. ఇక ఢిల్లీ న‌గ‌ర పాలక సంస్థ ఎన్నిక‌ల్లో ఆప్ ఘ‌న విజ‌యాన్ని సాధించ‌డంపై ఎంపీ రాఘ‌వ చ‌ద్దా(Raghav Chadha) స్పందించారు.

ఒక్క‌డిని ఓడించేందుకు బీజేపీ నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేసింద‌ని కానీ కేజ్రీవాల్ ను ఓడించలేక పోయిందంటూ ఎద్దేవా చేశారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇవాళ చిన్న పార్టీ. నిజాయ‌తీ, విద్యావంతులైన పార్టీ. ప్ర‌పంచంలోనే అతి పెద్ద పార్టీని ఓడించింద‌న్నారు. చివ‌రి దాకా ఆప్, బీజేపీ మ‌ధ్య కీల‌క పోరు కొన‌సాగింద‌న్నారు.

ఏడుగురు సీఎంల‌ను తీసుకు వ‌చ‌చ్చింది. 17 మందికి పైగా స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ను వాడుకుంది. 100 మందికి పైగా ఎంపీలు ప్ర‌చారం చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీ ఇలా ప్ర‌తి ఒక్క దానిని ప్ర‌యోగించింది. కానీ ఉన్న అధికారాన్ని బీజేపీ కోల్పోయింద‌న్నారు రాఘ‌వ్ చ‌ద్దా.

Also Read : కేవ‌లం గెలుపు కాదు అతి పెద్ద బాధ్య‌త

Leave A Reply

Your Email Id will not be published!