KCR CM : కొండగట్టు అంజన్నకు కేసీఆర్ నజరానా
రూ. 100 కోట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి
KCR CM : తెలంగాణ సీఎం ఉద్యమకారుడే కాదు అపర భక్తుడు కూడా. ఆయన సాహితీ పిపాసి. అంతకంటే ఎక్కువగా వక్త. రచయిత. కవి కూడా. ఆశువుగా పద్యాలు చెప్పడం ఆయనకు అలవాటు కూడా. ఉత్సాహం వచ్చిందంటే కేసీఆర్ ఎవరి మాటా వినడు. అందుకే నభూతో నభవిష్యత్ అన్న చందంగా యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దారు.
ఇప్పుడది తిరుమలను తలపింప చేస్తోంది. తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. జగిత్యాలలో పర్యటించిన సీఎం(KCR CM) కొండగట్టు అంజన్న స్వామి ఆలయ అభివృద్దికి ఏకంగా రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన ఆలయాలు మరింత అద్భుతంగా, సర్వాంగ సుందరంగా తయారైనట్లు చెప్పారు.
తాను సీఎంగా కొలువు తీరాక గుడులపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు. ఆనాటి ఉద్యమాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కేసీఆర్. మహిమ కలిగిన నరసింహాస్వామి ధర్మపురికి వచ్చానని అన్నారు. ఈ స్వామి దయగలిగిన దేవుడే కాదు శక్తిమంతుడు కూడా. ఆయనను మొక్కుకున్నా రాష్ట్రం వచ్చిందని చెప్పారు.
తెలంగాణ ఆధ్యాత్మిక పరిమళాలు కలిగిన విశిష్టమైన ప్రాంతమని అన్నారు కేసీఆర్. కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు అంజన్న దేవాలయంతో పాటు పలు గుడులు చాలా ఉన్నాయని చెప్పారు సీఎం(KCR CM). ఆలయానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేది. కానీ తాను వచ్చాక 384 ఎకరాలకు ఈ గుడికి ఇచ్చానని ఇప్పుడు 400 ఎకరాలు ఉందని గుర్తు చేశారు.
మరింత అందంగా ఆలయాన్ని అభివృద్ది చేస్తామన్నారు.
Also Read : రైతన్నలకు కేసీఆర్ ఖుష్ కబర్