Piyush Goyal : కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు. ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకరు టీ అమ్మి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. మరొకరు అత్యంత నిరుపేద రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇవాళ దేశానికి దిశా నిర్దేశం చేసే పార్లమెంట్ లోని రాజ్యసభకు సారథ్యం వహిస్తున్నారు.
ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు. కేవలం భారత దేశంలో మాత్రమే సాధ్యమవుతుందని అది కేవలం ప్రజాస్వామ్యం ఉండడం వల్లనేనని ప్రశంసలు కురిపించారు పీయూష్ గోయల్(Piyush Goyal) . ఓ సాధారణ రైతు కొడుకు ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారంటూ జగదీప్ ధన్ ఖర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రాజ్యసభ చైర్మన్ గా మొదటిసారిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం కొలువు తీరిన జగదీప్ ధన్ ఖర్ కు ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, రాజ్యసభ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.
ఇక్కడ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఏ పార్టీలో ఉన్న వారైనా సరే అత్యున్నత స్థానాలలో ఉన్న సమయంలో వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పీయూష్ గోయల్(Piyush Goel) .
ఒకనాడు రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మిన నరేంద్ర దామోదర దాస్ మోదీ ఇవాళ ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామిక దేశంగా పేరొందిన భారత్ కు ప్రధానమంత్రిగా కొలువు తీరారని..వీరంతా ఒకనాడు సామాన్యులేనని కానీ కష్టపడి పైకి వచ్చి విజేతలుగా నిలిచారని ప్రశంసలు కురిపించారు కేంద్ర మంత్రి.
Also Read : నోట్ల రద్దు రికార్డులు లేవంటే ఎలా – సుప్రీం కోర్టు