YS Jagan : ఏపీలో బీసీల‌కు పెద్ద‌పీట – జ‌గ‌న్ రెడ్డి

జ‌య‌హో బీసీ మ‌హాస‌భ విజ‌య‌వంతం

YS Jagan : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆంధ్రాలో వారి ఆత్మ గౌర‌వాన్ని పున‌రుద్ద‌రించింద‌ని అన్నారు. జ‌య‌హో స‌భ‌కు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వర్గాల నుండి వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన ల‌క్ష మంది హాజ‌రు కావ‌డం విశేషం.

2017 -18లో తాను రాష్ట్ర వ్యాప్తంగా చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో క‌నీసం 130 ఓబీసీ వ‌ర్గాల స‌భ్యుల‌ను క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకున్నాన‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అందులో భాగంగానే వారికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి(YS Jagan).

వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం గ‌త మూడున్న‌ర ఏళ్లుగా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల ఆత్మ గౌర‌వానికి భంగం క‌ల‌గ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంద‌ని చెప్పారు. గ‌తంలో పాల‌కులు బీసీల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగా మాత్ర‌మే వాడుకున్నార‌ని , కానీ వారికి స‌ముచిత స్థానం తాము వ‌చ్చాక క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

అంతే కాకుండా చ‌ట్ట స‌భల్లో వారికి అవ‌కాశం క‌ల్పించ‌డం వ‌ల్ల ఇప్పుడు వారి ఆత్మ‌గౌరవం మ‌రింత ఇనుమ‌డించింద‌న్నారు సీఎం. స‌మాన అవ‌కాశాలు పొంద‌డం కార‌ణంగా సామాజిక సాధికార‌త సాధ్య‌మైంద‌ని తాను అనుకుంటున్న‌ట్లు తెలిపారు.

కేవ‌లం బీసీల అభ్యున్న‌తి కోసం భారీ ఎత్తున ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. గ‌త కొంత కాలంగా ల‌బ్దిదారుల ఖాతాల్లో నేరుగా న‌గ‌దు జ‌మ చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం.

ఇదిలా ఉండ‌గా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు తాను ఇచ్చిన హామీల్లో 90 శాతం నెర‌వేర్చ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

Also Read : రైత‌న్న‌ల‌కు కేసీఆర్ ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!