Himachal Pradesh Results : ‘హిమాచల్’ లో హస్తం ముందంజ
కాషాయానికి కోలుకోలేని బిగ్ షాక్
Himachal Pradesh Results : ఆక్టోపస్ లా విస్తరించిన భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఓ వైపు గుజరాత్ లో ముచ్చటగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే సర్కార్ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీని ఎప్పుడో దాటేసింది. కానీ ఊహించని రీతిలో హిమాచల్ ప్రదేశ్ లో(Himachal Pradesh Results) బీజేపీకి ఊహించని షాక్ తగిలింది.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గణనీయంగా సీట్లను చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. మొత్తం 68 సీట్లకు గాను హస్తం 40 సీట్లలో లీడ్ లో ఉంది. భారతీయ జనతా పార్టీ కేవలం 25 స్థానాలకే పరిమితం అయ్యింది. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జ్ రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
తమ ఎమ్మెల్యేలను కాపాడు కోవడం తమ ముందున్న సవాల్ అని పేర్కొన్నారు. పార్టీకి సంబంధించి 40కి పైగా చేరుకుంటే తమకు ఢోకా లేదన్నారు. ప్రధానమంత్రి తో పాటు కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు హిమాచల్ ప్రదేశ్ లో. కానీ జనం హస్తాన్ని నమ్మారు. బీజేపీని ఛీత్కరించారు.
ఎన్నికలు ప్రకటించాక పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు పీఎం. కానీ ఆశించిన ప్రయోజనం రాబట్టలేక పోయింది. మరో వైపు ఏఐసీసీ కీలక భేటీ జరిపింది. హిమాచల్ ప్రదేశ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కానీ బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడు కోవడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది.
ఇప్పటికే గోవాను ఆ పార్టీ మెజారిటీ ఉన్నా పవర్ లోకి రాలేక పోయింది. ట్రబుల్ షూటర్ అమిత్ షా ఏమైనా చేయగల సమర్థుడు.
Also Read : గుజరాత్ లో కమలం ప్రభంజనం