Manish Sisodia : గుజరాత్ ఓట్లతో ఆప్ ఇక జాతీయ పార్టీ
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం సిసోడియా
Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటింది. గణనీయమైన సీట్లను సాధించి మేయర్ సీటును కైవసం చేసుకుంది. ఈ తరుణంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లను కైవసం చేసుకోలేక పోయినప్పటికీ ఆప్ పెద్ద ఎత్తున ఓట్లను కొల్లగొట్టింది.
దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చడం వల్ల భారతీయ జనతా పార్టీకి మేలు చేకూరేలా చేసింది. మరో వైపు 77 సీట్లకు పైగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేర రాణించ లేక పోయింది. ఒక రకంగా ఆప్ పూర్తిగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడంలో సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఆప్ జాతీయ పార్టీగా అవతరించాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలవాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) గురువారం మీడియాతో మాట్లాడారు. గుజరాత్ ఓట్లు తమ పార్టీని జాతీయ పార్టీగా మారుస్తాయని అన్నారు. తమకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నామని చెప్పారు మనీష్ సిసోడియా.
ఇదే సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మరోసారి. దేశంలో విద్య, వైద్య, ఉపాధి, మహిళా సాధికారత కల్పించే తమ వైపు ప్రజలు చూస్తున్నారనేది అర్థమై పోయిందన్నారు. ఇందుకు తమ పార్టీకి వచ్చిన ఓట్ల శాతమేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాజాగా గుజరాత్ ఫలితాల్లో జాతీయ పార్టీల కంటే వెనుకబడి పోయినప్పటికీ బీజేపీ ఇంకా ఎనిమిది స్థానాలలో లీడ్ లో ఉండడం విశేషం.
Also Read : ‘హిమాచల్’ లో హస్తం ముందంజ