Shivpal Yadav Merge : ఎస్పీలో శివపాల్ యాదవ్ పార్టీ విలీనం
మెయిన్ పురిలో డింపుల్ యాదవ్ గ్రాండ్ విక్టరీ
Shivpal Yadav Merge : మెయిన్ పురి లోక్ సభ ఉప ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించారు సమాజ్ పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్. మాజీ సీఎం ములాయం సింగ్ మరణంతో ఈ లోక్ సభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఇక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఎస్పీకి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం జరిగింది.
కానీ ములాయం బతికి ఉన్నంత వరకు మెయిన్ పురి ఆయనకు పెట్టని కోటగా ఉంటూ వచ్చింది. ములాయంను అంతా యూపీలో జనం నేతాజీ అని పిలుచుకుంటారు. ఆయనకు ప్రజలు ప్రేమ పూర్వకంగా ఇచ్చిన వినమ్రమైన నివాళి అని పేర్కొన్నారు డింపుల్ యాదవ్.
ఇదిలా ఉండగా ఉప ఎన్నికల కంటే ముందు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన భార్యతో కలిసి మేనమామ శివపాల్ యాదవ్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. విభేదాలు మరిచి పోదామని కలిసి కట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గంలో తన మేనమామకు మంచి పట్టుంది.
భారీ మెజారిటీ రావడంతో ఇరు పార్టీలు కలిసిపోతేనే బావుంటుందనే నిర్ణయానికి ఇరువురూ వచ్చారు. ఈ మేరకు శివపాల్ యాదవ్ తన ప్రగతిశీల సమాజ్ వాది పార్టీని(Shivpal Yadav Merge) అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి కాదు ఏకంగా 2 లక్షలకు పైగా మెజారిటీని సాధించారు ఎస్పీ అభ్యర్థిని డింపుల్ యాదవ్.
దీంతో యూపీలో సరికొత్త రాజకీయ సమీకరణకు తెర లేపింది.
Also Read : గుజరాత్ ఎన్నికల్లో రివాబా జడేజా విక్టరీ