Jitendra Singh : ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 9.79 లక్ష‌ల జాబ్స్ ఖాళీ

పార్ల‌మెంట్ లో కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డి

Jitendra Singh : కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలోని వివిధ శాఖ‌ల్లో ఏకంగా 9 ల‌క్ష‌ల 79 వేల ఖాళీలు ఉన్నాయ‌ని మోదీ ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో భాగంగా స‌భ్యులు లేవ‌దీసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు కేంద్ర స‌హాయ మంత్రి జితేంద్ర సింగ్(Jitendra Singh) . ఆగ‌స్టు 2022 నాటికి ప్ర‌భుత్వ ఆఫీసుల్లో 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.

ఈ ఉద్యోగాల‌లో గ్రూప్ – ఎ పోస్టులు 23,584 కాగా, గ్రూప్ -బి పోస్టులు 1,18,807 ఉండ‌గా గ్రూప్ – సి కింద 8,36,936 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని చెప్పారు కేంద్ర మంత్రి.

సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, పెన్ష‌న్ల మంత్రిత్వ శాఖ లోక్ స‌భ‌కు తెలియ చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ‌లో 2,93,943 మంది, ర‌క్షణ శాఖ (సివిల్ ) లో 2, 64, 704 మంది, హోం వ్య‌వ‌హారాల శాఖ‌లో 1,43,536 మంది ఉన్నార‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే 4,035,203 పోస్టులు మంజూరు చేసినట్లు ప్ర‌క‌టించింది.

మార్చి 1, 2021 నాటికి 3,055, 876 పోస్టులు ఉన్న‌ట్లు ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కార్ వెల్ల‌డించింది. 64 పోస్టుల‌లో ఎనిమిది మాత్ర‌మే ఖాళీగా ఉన్న ఉప రాష్ట్ర‌ప‌తి సెక్ర‌టేరియ‌ట్ లో అతి త‌క్కువ సంఖ్య‌లో ఖాళీలు ఉన్నాయి. వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న , విద్య‌లో 13 , ప‌బ్లిక్ అసెస్ మేనేజ్ మెంట్ లో 14 జాబ్స్ ఖాళీగా ఉన్న‌ట్లు పేర్కొంది ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కార్.

వివిధ కేంద్ర శాఖ‌లు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లలో ఖాళీల సంఖ్య‌పై కాంగ్రెస్ ఎంపీ దీప‌క్ బైజ్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కేంద్ర మంత్రి ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో వివిధ మంత్రిత్వ శాఖ‌లు, విభాగాలు, పీఎస్ యులు , స్వ‌యం ప్ర‌తిప‌త్తి సంస్థ‌లు, బ్యాంకులు, ఇత‌ర సంస్థ‌ల ద్వారా 1.47 ల‌క్ష‌ల మంది కొత్త‌గా నియ‌మించ‌బ‌డ్డార‌ని వెల్ల‌డించారు.

Also Read : మ‌రాఠాపై బీజేపీ కుట్ర – సుప్రియా సూలే

Leave A Reply

Your Email Id will not be published!