BJP Celebrations : గుజ‌రాత్ లో బీజేపీ క‌మాల్

చ‌రిత్ర సృష్టించిన కాషాయం

BJP Celebrations : గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. కొత్త చ‌రిత్ర సృష్టించింది. గ‌తంలో త‌న మీద ఉన్న రికార్డును బీజేపీ(BJP Celebrations) అధిగ‌మించింది. గ‌తంలో కాంగ్రెస్ సృష్టించిన రికార్డును ఆనాడు సీఎంగా ఉన్న న‌రేంద్ర మోదీ అధిగ‌మించారు. తాజాగా మోదీ రికార్డును బీజేపీకి చెందిన భూపేష్ ప‌టేల్ తుడిచి వేశారు.

ఇది బీజేపీకి ఒక ర‌కంగా బ‌లాన్ని క‌లిగించింది. రాష్ట్రంలో 182 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 158 సీట్లు కైవ‌సం చేసుకుంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన 92 సీట్ల మార్జిన్ ను దాటేసింది. కొత్త రికార్డు న‌మోదు చేసింది.

2017లో జరిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకి 97 సీట్లు రాగా ఈసారి ఆ మార్కును దాటేసింది. గ‌తంలో 77 సీట్ల‌తో స‌త్తా చాటిన కాంగ్రెస్ గ‌ణ‌నీయంగా 17 సీట్ల‌కు ప‌డి పోయింది. ఇక కొత్త‌గా రంగంలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున దెబ్బ కొట్టింది. ప్ర‌త్యేకించి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును చీల్చ‌డంలో స‌క్సెస్ అయ్యింది. విచిత్రం ఏమిటంటే ఈ ఓటు షేర్ బీజేపీకి లాభం చేకూర్చేలా చేసింది. ఇందులో భాగంగా ఆప్ తాజాగా చేజిక్కించుకున్న సీట్ల‌తో జాతీయ హోదాను ద‌క్కించుకుంది.

1985 నుంచి గుజ‌రాత్ లో బీజేపీ ఓడి పోలేదు. గ‌త 27 ఏళ్ల పాల‌న‌లో ఆ పార్టీ అధికార వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోలేదు. పూర్తిగా పాజిటివ్ ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేసింది. ఆ మేర‌కు అనుకున్న దానికంటే ఎక్కువ సీట్ల‌ను చేజిక్కించుకుంది. ఇక అద్బుత విజ‌యం సాధించ‌డంతో సీఎంగా ఉన్న భూపేంద్ర ప‌టేల్ మ‌రోసారి ఈనెల 12న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఆప్ , ఎంఐఎం కాంగ్రెస్ కు శాపంగా మారాయి.

Also Read : ప్ర‌జా తీర్పు శిరోధార్యం – జైరామ్ ఠాకూర్

Leave A Reply

Your Email Id will not be published!