Congress Celebrations : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ క‌ళ‌క‌ళ‌

వెల వెల బోయిన కాషాయం

Congress Celebrations : గుజ‌రాత్ లో ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాదు చ‌రిత్ర సృష్టించిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో. మొత్తం 68 సీట్ల‌కు గాను ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మైన సీట్ల‌ను సాధించింది కాంగ్రెస్ పార్టీ(Congress Celebrations). ఆ పార్టీకి 40 సీట్లు ద‌క్కాయి. ఇక గ‌తంలో స‌ర్కార్ లో ఉన్న బీజేపీకి కేవ‌లం 25 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

దీంతో త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌ను జారుకోకుండా ఉండేందుకు నానా తంటాలు ప‌డుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇక గుజ‌రాత్ లో బోణీ కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప్ర‌భావం చూప‌లేక పోయింది. ముగ్గురు అభ్య‌ర్థులు స్వతంత్ర అభ్య‌ర్థులుగా గెలుపొందారు. అయితే ట్ర‌బుల్ షూట‌ర్ , కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా ఏ మాత్రం ఓట‌మిని ఒప్పుకోరు.

ఏ చిన్న‌పాటి అవ‌కాశం వ‌చ్చినా దానిని ఉప‌యోగించు కునేందుకు రెడీగా ఉంటారు షా. ఈ త‌రుణంలో ఇప్ప‌టికే ఉన్న ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేసిన ఘ‌న‌త భార‌తీయ జ‌న‌తా పార్టీకే ద‌క్కుతుంది. ఇదిలా ఉండ‌గా గుజ‌రాత్ లో వ‌ర్క‌వుట్ అయిన ప్ర‌ధాని చ‌రిష్మా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో చూప‌లేక పోయింది.

ఆయ‌న‌తో పాటు ట్ర‌బుల్ షూట‌ర్ , మంత్రులు, ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అయినా ఆశించిన ఫ‌లితాలు రాబ‌ట్ట‌లేక పోయింది. అయితే కేవ‌లం ఒకే ఒక్క శాతంతో తాము ప‌రాజ‌యం పాలైన‌ట్లు పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. విచిత్రం ఏమిటంటే ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 9 సీట్లు మాత్ర‌మే కైవ‌సం చేసుకోగ‌లిగింది.

Also Read : గుజ‌రాత్ లో బీజేపీ క‌మాల్

Leave A Reply

Your Email Id will not be published!