PM Narendra Modi : దైవభూమిలో పని చేయని మోదీ మంత్రం
పవర్ కోల్పోయిన బీజేపీ..కాంగ్రెస్ హవా
PM Narendra Modi : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా ఏ మాత్రం పని చేయలేక పోయింది. అధికారంలో ఉన్న కాషాయం పవర్ కోల్పోయింది. అటు గుజరాత్ తో పాటు ఇటు హిమాచల్ ప్రదేశ్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు.
నరేంద్ర మోదీతో(PM Narendra Modi) పాటు ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు కేంద్ర మంత్రులు, ప్రముఖులు, బాధ్యులు క్యాంపెయిన్ చేసినా ఫలితం లేక పోయింది. ఎన్నో హామీలతో పాటు ప్రారంభోత్సవాలు చేశారు. కానీ హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకున్నారు. ప్రధానంగా బీజేపీని గద్దె దించారు. అనూహ్యంగా కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇది ఊహించని షాక్ అని చెప్పక తప్పదు.
అయితే బీజేపీకి మూడు చోట్లో పోటీ చేస్తే కేవలం ఒక్క గుజరాత్ లోనే జెండా ఎగుర వేసింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ పీఠాన్నా బీజేపీ కోల్పోయింది. అక్కడ 15 ఏళ్ల పాటు కొనసాగించింది భారతీయ జనతా పార్టీ. కానీ దేశ రాజధాని వాసులు కాషాయాన్ని వద్దనుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 68 సీట్లకు గాను 40 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోగా 25 సీట్లకే భారతీయ జనతా పార్టీ పరిమితమైంది. మరో మూడు సీట్లలో స్వతంత్రులు గెలుపొందారు.
Also Read : గుజరాత్ కు రుణపడి ఉన్నా – మోదీ