Himachal Pradesh CM : హిమాచల్ ప్రదేశ్ సీఎంపై ఉత్కంఠ
కాంగ్రెస్ లో పలువురు ఆశావహులు
Himachal Pradesh CM : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ప్రజలు తిరస్కరించారు. అభివృద్ది మంత్రం, మోదీ ప్రచారం పని చేయలేదు. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చేందుకు కావాల్సిన మెజారిటీ సాధించింది. ప్రస్తుతం తమ ఎమ్మెల్యేలను బీజేపీ వైపు చూడకుండా, కొనుగోలు చేయకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతోంది.
ఇదే సమయంలో సీఎంగా ఎవరు ఎన్నికవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పలువురు నాయకులు రేసులో ఉన్నారు. ఇక రాష్ట్రంలో మొత్తం 68 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను కైవసం చేసుకోగా అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. మిగతా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.
ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గాను ఎవరిని సీఎం అభ్యర్థిగా(Himachal Pradesh CM) ఎంపిక చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ సమావేశం కానుంది. ప్రస్తుతానికి విశ్వసనీయ సమాచారం మేరకు వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ ముందంజలో ఉన్నారు. ఆమె రాజ కుటుంబానికి చెందిన మహిళ. ఇవాళ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసింది పార్టీ. సిమ్లా లోని రాడిసన్ హోటల్ లో ఈ మీటింగ్ జరగనుంది.
ఆమె పోటీ చేయలేదు కానీ వెనుక ఉంటూ ప్రచారాన్ని నడిపించింది. ప్రజలు కోరుకునే వారిని పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని తాను అనుకుంటున్నట్లు ఆమె తనయుడు విక్రమాదిత్యా సింగ్ అన్నారు.
ప్రతిభా సింగ్ తో పాటు రాష్ట్ర మాజీ చీఫ్ సుఖ్ విందర్ సింగ్ సుఖు, సీఎల్పీ నాయకుడు ముఖేశ్ అగ్ని హోత్రి, హర్షవర్దన్ చౌహాన్ ఉన్నారు. మరో నేత కుల్దీప్ సింగ్ రాథోడ్ గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పని చేశారు. కీలక సమావేశానికి హిమాచల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ రాజీవ్ శుక్లా, సీఎం భూపేష్ బాఘేల్ హాజరు కానున్నారు.
Also Read : చెరగని ముద్ర ధీర వనిత ‘సోనియా’