Kiren Rijiju NJAC : ఎన్‌జేఏసీపై ప్రతిపాదనలు ఏవీ లేవు
కొనసాగుతున్న తర్జన భర్జనలు
Kiren Rijiju NJAC : న్యాయమూర్తుల ఎంపిక వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఇప్పటికే కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు మధ్య వార్ నడుస్తోంది. ఈ తరుణంలో పుండు మీద కారం చల్లినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju), ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది.
కొలీజియం వ్యవస్థను తాము ఏర్పాటు చేయలేదని, అది పార్లమెంట్ ద్వారా చట్టంగా వచ్చిందని తెలిపింది. ఈ విషయం గురించి ఏజీ వెంకట రమణి కేంద్రానికి తెలియ చేయాలని స్పష్టం చేసింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు , హైకోర్టు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన ఎన్జీఏసీ చట్టాన్ని 2015లో అత్యున్నత న్యాయ స్థానం కొట్టి వేసింది.
ఇదే సమయంలో కొలీజియం వ్యవస్థపై దాడి చేశారు కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) . రాజ్యాంగానికి పరాయి అని అభివర్ణించారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. న్యాయమూర్తుల నియామకాల ప్రస్తుత విధానంపై సుప్రీంకోర్టుతో తర్జన భర్జనలు జరుగుతున్న తరుణంలో తగిన మార్పులతో నేషనల్ జ్యూడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ లేదా ఎన్ జేఏసీని(NJAC) పునః ప్రారంభించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం పార్లమెంట్ కు తెలిపింది.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ రాసిన లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డిసెంబర్ 5 నాటికి సుప్రీం నియామకానికి సంబంధించిన ప్రతిపొదన ఒకటి ఉంది.
కోర్టు న్యాయమూర్తి, కొలీజియం సిఫార్సు చేసిన హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఎనిమిది ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
Also Read : అమ్మకానికి ఎల్ఐసీ రెడీ