Kurt Campbell : భవిష్యత్తులో భారత్ ను తట్టుకోలేం
వైట్ హౌస్ ఆసియా కోఆర్డినేటర్
Kurt Campbell : అమెరికా వైట్ హౌస్ ఆసియా కోఆర్డినేటర్ కర్ట్ క్యాంప్ బెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ ఇక నుంచి మిత్ర దేశంగా ఉండదన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే సూపర్ పవర్ కలిగిన కంట్రీగా ఉంటుందన్నారు. ఆ శక్తి సామర్థ్యాలు భారత్ కు ఉన్నాయంటూ కితాబు ఇచ్చారు.
గత కొన్నేళ్లుగా అమెరికా కేవలం ఒకే ఒక్క దేశం భారత్ తోనే ఎక్కువ సత్ సంబంధాలు కలిగి ఉందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అన్ని రంగాలలో దూసుకు పోతోందని, ఓ వైపు కరోనా కష్ట కాలంలో కూడా భారత్ తనను తాను తట్టుకుని నిలబడగలిగిందని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన దేశంగా భారత్ ఉందని స్పష్టం చేశారు కర్ట్ క్యాంప్ బెల్(Kurt Campbell) .
సెక్యూరిటీ కౌన్సిల్ సందర్బంగా మీడియా అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు. టెక్నాలజీ పరంగా అత్యంత బలంగా భారత దేశం ఉందంటూ కితాబు ఇచ్చారు. ఖగోళ, విద్య, పర్యావరణం, సాంకేతిక , ఇ కామర్స్ , వ్యాపార, వాణిజ్యం, ఇలా ప్రతి రంగంలో అమెరికా, భారత్ కలిసి ప్రయాణం చేస్తున్నాయని ఇది ఏ ఇతర దేశం ఇంతలా అనుబంధం కలిగి లేదని పేర్కొన్నారు కర్ట్ క్యాంప్ బెల్.
గత కొంత కాలంగా కొంత ఇబ్బందులు ఏర్పడినా వాటిని పరస్పర అవగాహనతో క్లియర్ చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఇదే సమయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు చైనా విషయంపై. భారత్, అమెరికా బంధం వల్ల ఎవరికీ ఇబ్బంది కలగదని తాము అనుకుంటున్నామని చెప్పారు.
Also Read : రానా అయ్యూబ్ కు అమెరికా అవార్డు