Mandous AP Rains : మాండూస్ ప్ర‌భావం ఏపీ అప్ర‌మ‌త్తం

భారీగా కురుస్తున్న వ‌ర్షాలు

Mandous AP Rains : మాండూస్ తుపాను దెబ్బ‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్(Mandous AP Rains) లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముందస్తుగా వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించ‌డంతో ఏపీ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు.

సీఎస్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించాల‌ని, క‌లెక్ట‌ర్లు ద‌గ్గ‌రుండి బాధితుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు చేర‌వేయాల‌ని ఆదేశించారు సీఎం. ఇప్ప‌టికే ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు రంగంలోకి దిగాయి.

మ‌రో వైపు త‌మిళ‌నాడులో సైతం మాండూస్ తుపాను దెబ్బ‌కు భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఏ ఒక్క‌రు కూడా ఇబ్బంది ప‌డేందుకు వీలు లేద‌న్నారు సీఎం. ఒంగోలు, సింగ‌రాయ‌కొండ‌, జ‌రుగుమ‌ల్లి, కొత్త‌ప‌ట్నం, నాగులుప్ప‌ల‌పాడు మండ‌లాల్లోని ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు రెడీగా ఉన్నారు. మాండుస్ తుపాను ఎఫెక్ట్ తో న‌రసాపురం తీరం వెంట పెను గాలులు వీస్తున్నాయి. భారీ వ‌ర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ముంద‌స్తుగా మ‌త్స్య కారులు వేట‌కు వెళ్ల వ‌ద్ద‌ని ఆదేశించింది.

దీంతో బోట్లు తిరిగి తీరానికి చేరుకున్నాయి. మ‌రో వైపు చిత్తూరు జిల్లాలోని 4 మండ‌లాల్లో పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. భోజ‌న‌, ఇత‌ర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మంత్రి రోజా ద‌గ్గ‌రుండి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మ‌రో వైపు త‌మిళ‌నాడు మాండూస్ దెబ్బ‌కు విల విల లాడుతోంది.

Also Read : మాండూస్ బీభ‌త్సం అత‌లాకుత‌లం

Leave A Reply

Your Email Id will not be published!