Bhupendra Patel : కమల వికాసం భూపేంద్రుడికే పట్టం
రాష్ట్ర ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విక్టరీ
Bhupendra Patel : గుజరాత్ రాష్ట్ర చరిత్రలో భారతీయ జనతా పార్టీ మరోసారి కాషాయ జెండా ఎగుర వేసింది. గత 27 ఏళ్లుగా అప్రహతిహతంగా విజయం సాధిస్తూ వచ్చిన ఆ పార్టీ ఈ ఏడాది 2022లో జరిగిన ప్రతిష్టాత్మకంగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏకంగా 156 సీట్లను కైవసం చేసుకుంది.
ఇక గణనీయంగా ఓట్లను చీల్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ సీట్లకు గండి కొట్టింది. ఈ ఓటు బ్యాంకు చీలడంతో అది కాస్తా అధికారంలో ఉన్న బీజేపీకి ప్లస్ గా మారింది. దీంతో 182 సీట్లకు గాను భారీ మెజారిటీని సాధించింది. మరోసారి పవర్ లోకి వచ్చింది బీజేపీ.
ఇదిలా ఉండగా గతంలో అత్యధిక సీట్లను గెలిచిన రికార్డు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎంగా ఉన్న సమయంలో ఉండింది. కానీ దానిని ప్రస్తుతం సీఎంగా కొలువు తీరిన భూపేంద్ర పటేల్(Bhupendra Patel) దానిని చెరిపి వేశారు. ఆయన మరోసారి గుజరాత్ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కొలువు తీరనున్నారు.
ఈ మేరకు బీజేపీ అధిష్టానం ఆయనకే లైన్ క్లియర్ చేసింది. గుజరాత్ ఎన్నికల సందర్భంగా మరోసారి గెలిపిస్తే భూపేంద్రుడికే తిరిగి పట్టం కడతామని ప్రకటించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. హైకమాండ్ ముహూర్తం కూడా ఖరారు చేసింది. మోదీ ఈసారి గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
30 సార్లకు పైగా ర్యాలీలు చేపట్టారు. తనకు ఎదురే లేదని చాటారు. మొత్తంగా ఈనెల 12న భూపేంద్ర పటేల్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
Also Read : ఆప్ కౌన్సిలర్లతో బీజేపీ బేరం – సంజయ్ సింగ్