Saket Gokhale : ట్వీట్ సరే 135 మంది మాటేంటి – గోఖలే
కేవలం మాటలే పీఎంను గాయపర్చాయి
Saket Gokhale : తాను కేవలం చేసిన ట్వీట్ గురించి మాత్రమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాయపడ్డారని కానీ గుజరాత్ లో బ్రిడ్జి కూలిన ఘటనలో 135 మంది చనిపోతే బాధ పడక పోవడం దారుణమన్నారు టీఎంసీ సోషల్ మీడియా చీఫ్ సాకేత్ గోఖలే(Saket Gokhale). ఆయన పీఎంకు వ్యతిరేకంగా ట్వీట్ చేశారనే నెపంతో గోఖలేను పోలీసులు అరెస్ట్ చేశారు.
రెండు సార్లు అరెస్ట్ కు గురయ్యాడు. వాళ్లు నన్ను మాత్రమే అరెస్ట్ చేయగలరు. కానీ నా ఆలోచనలను , ట్వీట్లను నియంత్రించ లేరన్నారు. మొదటి కేసులో గోఖలే బెయిల్ పొందారు. తిరిగి అరెస్ట్ అయ్యాక మరోసారి బెయిల్ పొందారు ఇవాళ. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అయితే గోఖలే ప్రధానమంత్రి మోదీని కావాలని టార్గెట్ చేశారని, నకిలీ ఖాతా పేరుతో ట్వీట్ చేశారంటూ కేసు నమోదు చేశారు. దీనిపై తీవ్రంగా తప్పు పట్టారు టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇదిలా ఉండగా సోషల్ మీడియాతో పాటు టీఎంసీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు సాకేత్ గోఖలే(Saket Gokhale).
భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకే తనను అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు చేశారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు మరోసారి. ప్రధాన మంత్రి మోదీ 135 మంది చని పోతే బాధ పడలేదు కానీ ట్వీట్ వల్ల గాయపడ్డారని ఎద్దేవా చేయడం కలకలం రేపింది.
అయితే ఈ నాలుగు రోజుల వ్యవధిలో నా స్వేచ్ఛను సమర్థించినందుకు, తిరిగి నాకు రెండుసార్లు బెయిల్ ఇచ్చినందుకు న్యాయ వ్యవస్థకు నేను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు సాకేత్ గోఖలే.
Also Read : సీఎం రేసు నుంచి ప్రతిభా సింగ్ ఔట్