MLC Kavitha : 11న సీబీఐ విచారణ కవిత సిద్దమేనా
దర్యాప్తు చేపట్టనున్న సంస్థ
MLC Kavitha : కల్వకుంట్ల కవిత పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగింది. ఒకప్పుడు బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసి , దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఆమె ఉన్నట్టుండి మద్యం స్కాంలో ఇరుక్కోవడం తెలంగాణ ప్రజలను, ప్రత్యేకించి మహిళలను, పార్టీ శ్రేణులను విస్తు పోయేలా చేసింది.
మొత్తం ఈ స్కాంలో డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు మరో 34 మందిపై అభియోగాలు మోపింది. ఇప్పటికే శ్రీనివాసరావు, బోయనపల్లి అభిషేక్ రావుతో పాటు అమిత్ అరోరా, విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసింది. విచిత్రం ఏమిటంటే ఒకటే నెంబర్ పై 11 ఫోన్లను కవిత(MLC Kavitha) వాడిందని, వాటిని ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ధ్వంసం చేసిందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ సంచలన నిజాలు బయట పెట్టింది.
దీనిపై ఎమ్మెల్సీ కవిత ఖండించింది. తాను ఏ తప్పు చేయలేదని, కేవలం బీజేపీ ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని ఆరోపించింది. దీంతో సీబీఐ ఉన్నట్టుండి అమిత్ అరోరా అరెస్ట్ చేశాక కోర్టు ముందు అఫిడవిట్ సమర్పించింది. అందులో స్పష్టంగా కవిత పేరును చేర్చింది. ఆమె వాడిన నెంబర్ కూడా వెల్లడించింది. ఆమె ఎవరెవరితో మాట్లాడిందో కూడా తెలిపింది.
దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది కవిత. ఈనెల 6న విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసు జారీ చేసింది. అయితే తాను చాలా బిజీ అని హాజరు కాలేనంటూ పేర్కొంది. ఆమెనే 11, 12, 14, 15 తేదీలు ఆఫర్ ఇచ్చింది సీబీఐకి. ఇదిలా ఉండగా సీబీఐ 11న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
ఈ మేరకు కీలక ప్రకటన చేసింది కూడా. సో ఆదివారం కవిత విచారణను ఎదుర్కొంటారా లేక లాయర్లతో సంప్రదింపులు జరిపి తప్పుకుంటారా అనేది ఉత్కంఠ రేపుతోంది.
Also Read : శని పోయింది పీడ విరగడైంది – బండి