NHRC Chief : కంపెనీలలో మానవ హక్కుల ఉల్లంఘన
జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్
NHRC Chief : దేశంలోని పలు కంపెనీలలో మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జాతీయ మానవ హక్కుల కమిషన్ చీఫ్ అరుణ్ మిశ్రా(NHRC Chief) . దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. ఒక రకంగా హెచ్చరించారు కూడా. దేశంలోని దిగ్గజ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు సైతం పలువురిని తొలగిస్తున్నట్లు బాహాటంగా ప్రకటించాయి.
దీనిని తీవ్రంగా తప్పు పట్టారు ఎన్హెచ్ఆర్సీ చీఫ్ . ఆహార రంగంలో కీలకంగా ఉన్న ఇ కామర్స్ సంస్థ జొమాటో తమ సంస్థలో 3 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్ తో పాటు మెటా కూడా 10 వేల మందికి పైగా తొలగిస్తున్నట్లు వెల్లడించాయి.
ఇదే సమయంలో ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ ఏకంగా 20 వేల మందికి పైగా తొలగిస్తున్నట్లు పేర్కొన్నాయి. 74వ మానవ హక్కుల దినోత్సవం సందర్బంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ అరుణ్ కుమార్ మిశ్రా(NHRC Chief) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా మానవ హక్కుల స్థూల ఉల్లంఘనగా అభివర్ణించారు.
న్యాయ వ్యవస్థ, కార్య నిర్వాహక సంస్థలు వీటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలన్నారు. అటువంటి ఉల్లంఘనలను ఎదుర్కొనేందుకు సంస్థలు కొత్త విధానాన్ని అవలంభిస్తాయని పేర్కొన్నారు. బహుళజాతి సంస్థలు మానవ హక్కులను గౌరవించాలని , జాతీయ చట్ట పరమైన చట్రంలో ఉన్నతమైన బేరసారాల శక్తికి వ్యతిరేకంగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
మూల ధనం స్వేచ్ఛా తరలింపు మనీ లాండరింగ్ కు కారణం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అరుణ్ కుమార్ మిశ్రా.
Also Read : అమ్మకానికి ఎల్ఐసీ రెడీ