Pratibha Singh : హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
స్పష్టం చేసిన ప్రతిభా సింగ్
Pratibha Singh : హిమాచల్ ప్రదేశ్ సీఎం రేసులో చివరి దాకా ఉన్న దివంగత సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ చివరి నిమిషంలో తప్పుకున్నారు. పార్టీ హైకమాండ్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పార్టీకి సంబంధించి సుఖ్విందర్ సింగ్ సుఖును దైవభూమికి సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.
దీంతో సుఖును నియమించడంపై స్పందించారు ఎంపీ ప్రతిభా సింగ్. తాను హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరైనా , ఎంతటి స్థాయిలో ఉన్నా పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు.
పార్టీ అన్నాక పలువురు పోటీ పడతారని , కానీ అవకాశం కొందరికే దక్కుతుందన్నారు ప్రతిభా సింగ్(Pratibha Singh) . సీఎంగా ఎంపికైన సోదరుడు సుఖ్విందర్ సింగ్ సుఖును ఈ సందర్బంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. తాను సహాయ సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు. ఇక రాష్ట్రానికి నూతన సీఎంగా ఎంపికైనందుకు ఆయనను అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర రాజధాని సిమ్లాలోని రాడిసన్ హోటల్ లో 40 మంది ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ కు రాజీవ్ శుక్లాతో పాటు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ హాజరయ్యారు. చివరకు ఎమ్మెల్యేలతో తాము ఎవరిని హైకమాండ్ నిర్ణయిస్తే వారినే సీఎంగా ఎన్నుకుంటామని తీర్మానం చేశారు.
ఈ మేరకు ప్రతిపాదనలను పరిశీలకులకు అందజేశారు. మొత్తంగా నిన్నటి దాకా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ఇదిలా ఉండగా ఈసారి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సుఖు సారథ్యంలో ఆ పార్టీ పవర్ లోకి వచ్చింది. గణనీయంగా సీట్లు సంపాదించింది.
Also Read : హిమాచల్ సీఎంగా ‘సుఖు’