TPCC Appoints : టీపీసీసీ కీలక కమిటీల ఏర్పాటు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నో ఛాన్స్
TPCC Appoints : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి సంబంధించి కీలకమైన కమిటీలను ఏర్పాటు(TPCC Appoints) చేసింది. పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు గాను సంచలన ప్రకటన చేసింది.
రాజకీయ వ్యవహారాల కమటీ, కార్యనిర్వాహక కమిటీలను నియమించింది పార్థీ అధిష్టానం. విచిత్రం ఏమిటంటే ఈ రెండు ప్రధాన కమిటీల్లో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు. ఇది పార్టీ వర్గాలతో పాటు శ్రేణులను విస్మయానికి గురి చేసింది.
రాజకీయ వ్యవహారాల కమిటీకి మాణిక్కం ఠాగూర్ చైర్మన్ గా ఉన్నారు. ఈ కమిటీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ భట్టి విక్రమార్కతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలకు కూడా చోటు కల్పించింది హైకమాండ్. అంతే కాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లుగా మహ్మద్ అజారుద్దీన్ , అంజన్ కుమార్ యాదవ్ , జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ ను స్పెషల్ ఇన్వైటర్లను నియమించింది.
ఇక కార్యనిర్వాహక కమిటీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఎంపిక చేసింది. ఆయనతో పాటు 40 మందిని హైకమాండ్ నియమించింది. ఇందులో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలకు ప్రయారిటీ ఇచ్చింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇటీవల ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మొత్తంగా రేవంత్ రెడ్డి తన మార్కు చూపించారు ఈ కమిటీల ఎంపికలో.
Also Read : కోమటిరెడ్డికి కోలుకోలేని షాక్
Hon'ble Congress President has approved the proposal for the appointment of DCC Presidents, Vice Presidents and General Secretaries, for the Telangana Pradesh Congress Committee, as follows, with immediate effect pic.twitter.com/GJHp63evjw
— Telangana Congress (@INCTelangana) December 10, 2022