Sukhwinder Singh Sukhu : హిమాచ‌ల్ సీఎంగా ‘సుఖు’

ప్ర‌క‌టించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్

Sukhwinder Singh Sukhu : దైవ‌భూమిగా పేరొందిన హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఎవరు ముఖ్య‌మంత్రి అవుతార‌నే దానిపై నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది. ఈ మేర‌కు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగింది. మాజీ సీఎం వీర‌భ‌ద్ర సింగ్ భార్య , ఎంపీగా ఉన్న ప్ర‌తిభా సింగ్ చివ‌రి దాకా సీఎం రేసులో నిలిచింది.

ఇదే స‌మ‌యంలో ప‌రిశీకుల ఎదుట ఆమె మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు. సిమ్లాలో జ‌రిగిన రాడిస‌న్ హోట‌ల్ లో కీల‌క మీటింగ్ జ‌రిగింది. చివ‌ర‌కు పార్టీ ఎమ్మెల్యేలు హైక‌మాండ్ ఎవ‌రి పేరును సిఫారసు చేస్తే వారికే తాము ఒప్పుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా హైక‌మాండ్ సీఎం పేరును ఖ‌రారు చేసే బాధ్య‌త‌ను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీకి అప్ప‌గించింది.

దీంతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ గా ఉన్న సుఖ్వింద‌ర్ సింగ్ సుఖును (Sukhwinder Singh Sukhu) సీఎంగా ఎంపిక చేసింది. సుఖు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న వ‌య‌స్సు 58 ఏళ్లు. హ‌మీర్ పూర్ జిల్లా లోని న‌దౌన్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆదివారం సుఖ్వింద‌ర్ సింగ్ సుఖు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేయ‌డంలో, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు ఎస్ఎస్ సుఖు. ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్ని హోత్రిని నియ‌మించాల‌ని కోరారు సుఖు. ఇదిలా ఉండ‌గా ఆయ‌న రాహుల్ గాంధీకి స‌న్నిహితుడిగా పేరొందారు.

Also Read : సామాన్యుడికి ద‌క్కిన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!