N Chandrababu Naidu : ఏపీలో ఆర్భాటం తప్ప అభివృద్ది ఏది
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
N Chandrababu Naidu : ప్రచార ఆర్భాటం తప్పా ఆచరణలో అభివృద్ది కనిపించడం లేదన్నారు టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన కంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్లనే ఏపీ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని ఆరోపించారు. అప్పులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.
రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలని మరోసారి రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఒక్కసారి రాష్ట్రం విడి పోయాక మళ్లీ కలిసి ఉండడం జరగదన్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదన్నారు. ఇదంతా జనం చెవుల్లో పూలు పెట్టడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలవాలని మంత్రులు కోరువడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రానికి సంబంధించి ఎలా అభివృద్ది చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టకుండా, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఇలా సొల్లు కబుర్లు చెబితే ఎలా అని ప్రశ్నించారు టీడీపీ చీఫ్. ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన జరిగి ఎనిమిది ఏళ్లు పూర్తయి పోయాక ఇప్పుడు మళ్లీ గుర్తుకు రావడం, అసంబద్ద ప్రకటనలు చేయడం కేవలం ఎన్నికల స్టంటుగా కొట్టి పారేశారు చంద్రబాబు నాయుడు(N Chandrababu Naidu).
ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని, ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకే ఇలాంటి పనికిమాలిన ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. వైఎస్ జగన్ పాలనలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారిని ఆదుకోలేదని ఆరోపించారు.
Also Read : బొగ్గు స్కాంలో రూ. 152.31 కోట్ల ఆస్తులు సీజ్