VC Sajjanar : సంక్రాంతికి స్పెష‌ల్ బ‌స్సులు

అద‌న‌పు బ‌స్సుల ఏర్పాటు

VC Sajjanar : రెండు తెలుగు రాష్ట్రాల‌లో సంక్రాంతి పండుగ ప్రాముఖ్య‌త అంతా ఇంతా కాదు. ప్ర‌త్యేకించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన వేలాది మంది తెలంగాణ‌లో ఉంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, ఇత‌ర వ్యాపార‌, వాణిజ్య ప‌రంగా ఇక్క‌డ ఉన్న వారంతా పెద్ద ఎత్తున త‌మ ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ‌తారు.

ఒక ర‌కంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ అత్యంత ముఖ్య‌మైన‌దిగా భావిస్తారు. కోళ్ల పందాలు పెద్ద ఎత్తున జ‌రుగుతాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ స‌జ్జ‌నార్(VC Sajjanar) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు టీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ముందస్తుగా బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

త‌మ త‌మ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సుల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. ఈసారి గ‌త ఏడాది కంటే ఎక్కువ‌గా బ‌స్సులు వేశామ‌ని తెలిపారు. 4,233 బ‌స్సుల‌ను సంక్రాంతి పండుగ కోసం స్పెష‌ల్ బ‌స్సుల‌ను ఏర్పాటు చేశామ‌ని ప్ర‌యాణీకులు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా హాయిగా త‌మ ఊళ్ల‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు స‌జ్జ‌నార్.

గ‌త ఏడాదిలో న‌డిపిన బ‌స్సుల కంటే ఈసారి 10 శాతం అద‌నంగా బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. 2023 జ‌న‌వ‌రి 7 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ఈ స్పెష‌ల్ బ‌స్సులు న‌డుపుతామ‌ని తెలిపారు. ఈ మొత్తం ఏర్పాటు చేసిన బ‌స్సుల్లో 585 బ‌స్సు ల‌కు సంబంధించి ముంద‌స్తు రిజర్వేష‌న్ సౌక‌ర్యం క‌ల్పించిన‌ట్లు వెల్ల‌డించారు ఎండీ.

ఇందులో భాగంగా అమ‌లాపురంకు 125, కాకినాడ‌కు 117, కందుకూరుకు 83, విశాఖ‌కు 65, పోల‌వరానికి 51, రాజ‌మండ్రికి 40 ప్ర‌త్యేక బ‌స్సులు న‌డుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : సీబీఐ రాక స‌ర్వ‌త్రా ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!