INK Thrown Minister Patil : మంత్రి పాటిల్ పై సిరాతో దాడి
పూలే..అంబేద్కర్ పై కామెంట్స్
INK Thrown Minister Patil : మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్. దీంతో ఆయన ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి బాటిల్ లోని సిరాను ఆయన ముఖంపై చల్లాడు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ సమీపంలో గల ఐఠాన్ లో చంద్రకాంత్ పాటిల్ పూలే, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పింప్రి చించ్ వాడ్ లోని చించ్ వాడ్ గావ్ ప్రాంతం లోని పార్టీ నాయకుడి నివాసం నుండి బయలు దేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు మంత్రిపై ఇంకు విసిరారు(INK Thrown Minister Patil) . మరో ఇద్దరు నినాదాలు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పింప్రి చించ్వాడ్ పోలీస్ కమిషనర్ అంకుష్ షిండే వెల్లడించారు. వీరిలో ఒకరికి 34 ఏళ్లు ఉన్నాయి. పింప్రిలో నివసిస్తున్నారు. మిగిలిన ఇద్దరి ఎక్కడి నుంచి వచ్చారనే దాని గురించి ఆరా తీస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదని తెలుస్తోందన్నారు. కానీ ఇంకా అసలు విషయం తెలియాల్సి ఉందన్నారు. పైథాన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. జ్యోతిబా పూలే, భౌరావ్ పాటిల్ , అంబేద్కర్ లు పాఠశాలలు ప్రారంభించారని , ప్రభుత్వం సాయం లేదన్నారు.
ఇదే సమయంలో వారు ప్రజల వద్దకు వెళ్లి అడుక్కోవడం ద్వారా బడులు ప్రారంభించారని ఆరోపించారు.
Also Read : మరాఠా ప్రజలకు షిండే భరోసా