ED Attaches : బొగ్గు స్కాంలో రూ. 152.31 కోట్ల ఆస్తులు సీజ్
వెల్లడించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ
ED Attaches : ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). రాష్ట్రంలో బొగ్గు స్కాం కలకలం రేపింది. ఇందులో భాగంగా బొగ్గు స్కాంకు సంబంధించి రూ. 152.31 కోట్ల విలువైన ఆస్తులను(ED Attaches) ఈడీ జప్తు చేసింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియా, ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్ సహా పలువురికి చెందిన విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు పేర్కొంది.
ఈ బొగ్గు కుంభకోణంలో నిందితులు ఏకంగా రూ. 500 కోట్లకు పైగా దోపీడికి పాల్పడ్డారని ఫెడరల్ ఏజెన్సీ తెలిపింది. కోర్పా , రాయ్ గఢ్ ప్రాంతాల్లోని కలెక్టర్ల కార్యాలయాల మైనింగ్ విభాగాలతో సహా 75 కంటే ఎక్కువ ప్రదేశాలలో సోదాలు చేపట్టింది.
నిందితులకు వ్యతిరేకంగా నేర పూరిత సాక్ష్యాలను సేకరించినట్లు వెల్లడించింది ఈడీ. దాదాపు 100 మందికి పైగా వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేసిందని పేర్కొంది. అసలు విషయం బయట పడింది. భారీ కుట్రలో భాగంగా విధాన పరంగా మార్పులు చోటు చేసుకున్నాయని స్పష్టం చేసింది.
రవాణా అనుమతుల జారీకి ఇప్పటికే ఉన్న సమర్థవంతమైన ఆన్ లైన్ వ్యవస్థను సవరించేందేఉకు గాను జూలై 15, 2020న మైనింగ్ డైరెక్టర్ ఏకంగా ఉత్తర్వు జారీ చేసినట్లు ఈడీ వెల్లడించింది. బొగ్గు వినియోగదారులు రాష్ట్ర మైనింగ్ అధికారులతో నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్ కోసం బలవంతంగా దరఖాస్తు చేసేలా మాన్యువల్ లేయర్ ప్రవేశ పెట్టారంటూ దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
Also Read : మరాఠా ప్రజలకు షిండే భరోసా