MLC Kavitha : సీబీఐ రాక సర్వత్రా ఉత్కంఠ
నేడు ఎమ్మెల్సీ కవిత విచారణ
MLC Kavitha : ఒకప్పుడు బతుకమ్మగా పేరొందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. విచిత్రం ఏమిటంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో ఎంతో పాపులర్ అయిన ఆమె ఉన్నట్టుండి ఢిల్లీ మద్యం స్కాంలో పేరు రావడం అందరినీ విస్తు పోయేలా చేసింది.
దేశ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర అంటూ నెట్టి వేసే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే సీబీఐ సంచలన వివరాలు బయట పెట్టింది. ఆమె ఫోన్ నెంబర్ తో 11 ఫోన్లను ధ్వంసం ఎలా చేసిందనే దానిపై క్లారిటీ ఇచ్చింది. దీంతో కిమ్మనకుండా విచారణకు రావచ్చని తెలిపింది.
అయితే సీబీఐ ఈనెల 6న విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. అయితే ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని, అందుకే తాను హాజరు కాలేనంటూ పేర్కొంది. ఆపై మాట మార్చింది. తాను చాలా ఫుల్ బిజీ అని మీకు వివరాలు చెప్పేటంత టైం తనకు లేదంటూ స్పష్టం చేసింది కవిత(MLC Kavitha).
దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆమె అప్పటి వరకు మూడు సార్లకు పైగా ప్రగతిభవన్ కు వెళ్లింది. తండ్రి సీఎం కేసీఆర్ తో ముచ్చటించింది. న్యాయ నిపుణుల సలహాలు స్వీకరించింది. ఎమ్మెల్సీ కవితతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి కలిసి రూ. 100 కోట్లు ముడుపులుగా ఇచచారంటూ బాంబు పేల్చింది సీబీఐ.
ఆదివారం సీబీఐ ఆమె ఇంటికి రానుంది. ఈ తరుణంలో కవిత ఏం చెబుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
Also Read : కోమటిరెడ్డికి కోలుకోలేని షాక్