K Sudhakaran : శశి థరూర్ పార్టీకి బలమైన ఆస్తి – సుధాకరన్
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కామెంట్స్
K Sudhakaran : కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కె. సుధాకరన్(K Sudhakaran) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తన నియోజకవర్గంలో పర్యటించడం కలకలం రేపింది. ఆయన పార్టీలోనే ఉంటూ వేరే వర్గాన్ని తయారు చేస్తున్నారంటూ కొందరు నేతలు ఆందోళన చెందారు. దీంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు శశి థరూర్. తాను పార్టీకి విధేయుడిగానే ఉన్నానని స్పష్టం చేశారు.
ఏనాడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని చెప్పారు. అంతే కాదు పోటీ చేసినంత మాత్రాన వ్యతిరేక ముద్ర ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు శశి థరూర్. దీంతో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన తాజాగా జరిగిన ఏఐసీసీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆపై ఊహించని రీతిలో ఓట్లు కూడా తెచ్చుకున్నారు. ఇక బరిలో ఉన్న మల్లికార్జున్ ఖర్గేకు గాంధీ ఫ్యామిలీ పూర్తి మద్దతు ప్రకటించింది.
ఈ తరుణంలో కేపీసీసీ చీఫ్ కె. సుధాకరన్ స్వరం మార్చారు. ఆపై ఏకంగా శశి థరూర్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన పార్టీకి బలమైన ఆస్తి అని కొనియాడారు. ఆయన ఉండడం వల్ల పార్టీకి అదనపు బలమే తప్ప ఇబ్బంది ఏమీ ఉండదని స్పష్టం చేశారు. శశి థరూర్ అమాయకుడు కాదని, ఆయన అత్యంత బలమైన నాయకుడిగా ఉన్నారని పేర్కొన్నారు సుధాకరన్(K Sudhakaran).
ఆయనను ఏ శక్తి వేరు చేయలేదని కుండ బద్దలు కొట్టారు కాంగ్రెస్ చీఫ్. శశి థరూర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. పార్టీ చట్రంలోనే ఉంటూ పని చేశారు తప్పా ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని పేర్కొన్నారు.
Also Read : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో సింధియా ఆరా