Ashwini Vaishnaw : రూ. 1.25 ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం వెలికితీత‌

పార్ల‌మెంట్ లో అశ్విని వైష్ణ‌వ్ వెల్ల‌డి

Ashwini Vaishnaw : దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 1.25 ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల ధ‌నాన్ని వెలికి తీశామ‌ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్(Ashwini Vaishnaw) వెల్ల‌డించారు. దేశంలోని ప్ర‌తి వ్య‌క్తికి సుప‌రిపాల‌న అందించేందుకు ప్ర‌ధాన‌మంత్రి కంక‌ణం క‌ట్టుకున్నార‌ని చెప్పారు. ఇందులో భాగంగానే డిజిట‌ల్ నిర్మాణాన్ని సిద్దం చేశార‌ని తెలిపారు.

డిజిట‌లైజేష‌న్ కార‌ణంగా దేశానికి మ‌రింత ఆదాయం స‌మ‌కూరింద‌న్నారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు రూ. 1.25 ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల ధ‌నాన్ని వెలికి తీసింద‌ని చెప్పారు. అంతే కాకుండా రూ. 4,600 కోట్ల విలువైన అక్ర‌మ ఆస్తుల‌ను అటాచ్ చేసింద‌ని వెల్ల‌డించారు. సోమ‌వారం పార్ల‌మెంట్ సమావేశాల‌లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు కేంద్ర మంత్రి.

పేద‌ల సంక్షేమం కోసం ఉంచిన రూపాయిలో కేవ‌లం 15 పైస‌లు మాత్ర‌మే పేద‌ల‌కు చేరుతోంద‌ని మాజీ ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్ గాంధీని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇవాళ 100 శాతం డ‌బ్బులు నేరుగా ప్ర‌భుత్వ బ్యాంకుల ద్వారా ల‌బ్దిదారుల‌కు చేరుతోంద‌ని చెప్పారు అశ్విని వైష్ణ‌వ్(Ashwini Vaishnaw).

ఆనాటి పీఎం 85 శాతం ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేర‌డం లేద‌ని ఆవేద‌న చెందార‌ని కానీ ఇవాళ అత్య‌ధిక శాతం చేరుతున్నాయ‌ని ఇదంతా త‌మ ప్ర‌ధాని మోదీ తీసుకున్న నిర్ణ‌యం కార‌ణమ‌ని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఇవాళ రూ. 26 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు నేరుగా ప్ర‌జ‌ల ఖాతాల్లోకి బ‌దిలీ చేస్తున్నామ‌ని తెలిపారు. దీని వ‌ల్ల ప్ర‌భుత్వానికి రూ. 2.25 ల‌క్ష‌ల కోట్లకు చేరుకుంద‌న్నారు.

45 కోట్ల జ‌న్ ధ‌న్ ఖాతాల నుండి డిజిట‌ల్ టెక్నాల‌జీని వినియోగిస్తున్నార‌ని తెలిపారు. 135 కోట్ల మంది ఆధార్ కార్డులు కూడా పొందార‌ని చెప్పారు అశ్విని వైష్ణ‌వ్.

Also Read : సుస్థిర అభివృద్ది కేంద్రం ల‌క్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!