Dimple Yadav Akhilesh : ఆకట్టుకున్న ‘అఖిలేష్..డింపుల్’
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన కపుల్స్
Dimple Yadav Akhilesh : యూపీలోని మెయిన్ పురి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు సమాజ్ వాదీ పార్టీ నుంచి డింపుల్ యాదవ్. ఆమె తన భర్త , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలిసి ఢిల్లీకి వచ్చారు. గతంలో అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎంపీ పదవికి కాకుండా ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. తన తండ్రి, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్ పురి లోక్ సభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో తన భార్య డింపుల్ యాదవ్(Dimple Yadav) ను అభ్యర్థిగా నిలబెట్టారు. మేనమామ శివ్ పాల్ యాదవ్ కు ఇక్కడ గట్టి పట్టు ఉంది.
అంతే కాదు యూపీ చరిత్రలో ఏడు సార్లకు పైగా మెయిన్ పురి నియోజకవర్గం నుంచి దివంగత ములాయం సింగ్ యాదవ్ గెలుపొందారు. ఇది ఓ రికార్డు కూడా. కానీ ఈసారి జరిగిన ఉప ఎన్నికల్లో నేతాజీకి నివాళిగా ప్రజలు పెద్ద ఎత్తున డింపుల్ యాదవ్ కు బ్రహ్మరథం పట్టారు.
ఆమెకు అడుగడుగునా నీరాజనం పలికారు. మరో వైపు మేనమామ తన పార్టీని సమాజ్ వాదీ పార్టీతో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా విజయం సాధించిన డింపుల్ యాదవ్ సోమవారం లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో వైపు అఖిలేష్ యాదవ్ తన భార్య ప్రమాణ స్వీకారం చేస్తుండగా సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నారు.
అంతకు ముందు భార్య , భర్తలు కలిసి లోక్ సభకు వచ్చారు. దీంతో కెమెరాలన్నీ ఆ ఇద్దరి చూడముచ్చట జంటను బంధించేందుకు యత్నించాయి.
Also Read : ఎంపీగా డింపుల్ యాదవ్ ప్రమాణ స్వీకారం