Supreme Court : సిసోడియాపై సుప్రీంకోర్టు కామెంట్స్

సిసోడియా పిటిష‌న్ పై స‌ర్వోన్న‌త న్యాయ స్థానం

Supreme Court  :  ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా(Manish Sisodia) దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అవినీతి ఆరోప‌ణ‌ల‌పై అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ వేసిన ప‌రువు న‌ష్టం కేసును కొట్టి వేయాల‌ని కోరుతూ వేసిన పిటిష‌న్ ను హైకోర్టు కొట్ట‌వేసింది. ఈ సంద‌ర్బంగా దానిని స‌వాల్ చేస్తూ మ‌నీష్ సిసోడియా భార‌తదేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానంను ఆశ్ర‌యించారు.

ఈ సంద‌ర్భంగా విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మీరు బ‌హిరంగ చ‌ర్చ‌ను ఈ స్థాయికి త‌గ్గించిన‌ట్ల‌యితే మీరు ప‌ర్య‌వ‌సానాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది అంటూ సిసోడియా  దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను కొట్టివేస్తూ గౌహ‌తి హైకోర్టు తీర్పు చెప్పింది.

దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్ర‌యించారు. దీంతో అసోం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాపై క్రిమిన‌ల్ కేసుతో పాటు ప‌రువు న‌ష్టం దావా వేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన గౌహ‌తి హైకోర్టు ధ‌ర్మాస‌నం న‌వంబ‌ర్ 4న తీర్పు చెప్పింది.

ఇదిలా ఉండ‌గా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌కు వ్య‌తిరేకంగా సిసోడియా దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను స్వీక‌రించేందుకు అత్యున్న‌త న్యాయ స్థానం విముఖ‌త చూపించింది. దీంతో ఆప్ నాయ‌కుడు దానిని ఉప‌సంహ‌రించుకున్నారు.

క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలో నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ అధికారుల‌కు మార్కెల్ ధ‌ర‌ల కంటే ఎక్కువ పీపిఇ కిట్ ల స‌ర‌ఫ‌రాకు సంబంధించి త‌న‌పై నిరాధార అవినీతి ఆరోప‌ణ‌లు చేసినందుకు సిసోడియాపై అస్సాం సీఎం కేసు దాఖ‌లు చేశారు. 2020లో రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న స‌మ‌యంలో శ‌ఱ్మ త‌న భార్యకు చెందిన సంస్థ‌కు ఆర్డ‌ర్లు ఇచ్చారంటు సిసోడియా ఆరోపించారు.

Also Read : బిల్కిస్ బానో రివ్యూ పిటీష‌న్ పై ప‌రిశీల‌న

Leave A Reply

Your Email Id will not be published!