CM Bommai : సరిహద్దు వివాదంపై బొమ్మై కామెంట్
అమిత్ షాతో హాజరు కానున్న షిండే
CM Bommai : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే దాడుల దాకా వెళ్లింది. కేంద్రం లో ఇటు రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రభుత్వాలు కొలువు తీరాయి. కానీ మరోసారి ఈ వివాదం రాజుకుంది. సుప్రీంకోర్టులో ఈ వివాదం నడుస్తోంది.
ఇటీవల సరికొత్త వివాదానికి తెర తీసింది కర్ణాటక సర్కార్. ఈ మేరకు మరాఠాలోని కొన్ని గ్రామాలు తమవేనంటూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీంతో వివాదం మళ్లీ రేగింది. దాడుల వరకు వెళ్లాయి. కర్ణాటక రక్షణ సమితికి చెందిన కొందరు మహారాష్ట్రకు చెందిన వాహనాలపై దాడికి దిగారు.
దీంతో కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ మేరకు అటు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఇటు కర్ణాటక సీఎం బొమ్మైలను(CM Bommai) ఢిల్లీకి రావాల్సిందిగా కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సూచించారు. దీంతో ఢిల్లీలో షిండేతో మాట్లాడ బోయే ముందు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడారు.
తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. అయితే సరిహద్దు వివాదంపై చర్చించేందుకు అమిత్ షా రమ్మన్నారని తెలిపారు. ఇందుకు తాము సంసిద్దంగా ఉన్నామని చెప్పారు సీఎం.
ఇదిలా ఉండగా డిసెంబర్ 14న బుధవారం సాయంత్రం బొమ్మై, షిండేలు అమిత్ షా సమక్షంలో కలువనున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో రాష్ట్ర వైఖరిని స్పష్టం చేస్తామని చెప్పారు కర్ణాటక సీఎం.
Also Read : ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ కు కీలక పోస్ట్